నిన్న అయోధ్య..నేడు బద్రినాథ్‌ ఎన్నికలో బీజేపీ ఘోర ఓటమి: మతం అంటే చిరాకు పడుతున్న జనం

Badrinath by election result 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే వస్తోన్నాయి. అలాంటి ఇలాంటి దెబ్బలు కాదు. హైఓల్టేజ్ షాక్ కొడుతోందా పార్టీకి. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితికి దిగజారింది బీజేపీ. ఎన్డీఏ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో బొటాబొటి మెజారిటీతో ఏలుతోంది.

ఆ ఓటమి అనేది ఇంకా వీడలేదు. వెంటాడుతూనే వస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఘోర పరాజయాలే ఎదురయ్యాయి. 13 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆధిక్యతలో ఉన్నది రెండు చోట్లే. 10 చోట్ల ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థులు భారీ మెజారిటీతో లీడ్‌లో కొనసాగుతున్నరు. కొన్ని చోట్ల విజయం సాధించారు.

After Ayodhya BJP now loses Badrinath Assembly seat in bypoll

దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఆ పార్టీకి ఇక్కడ వరుసగా రెండో ఓటమి. అలాగే- మంగళౌర్‌ ఉప ఎన్నికలో కూడా పరాజయం పాలైంది. అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవలేకపోయింది కాషాయపార్టీ. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.

బద్రినాథ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా.. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన రాజేంద్రసింగ్ భండారిపై 5,224 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2022 నాటి ఎన్నికల్లో ఇదే రాజేంద్రసింగ్ భండారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత పార్టీ ఫిరాయించారు.

తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఆయన రాజీనామా వల్ల బద్రినాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఫలితం మాత్ర రివర్స్ అయింది. బీజేపీ అభ్యర్థిగా రాజేంద్రసింగ్ భండారి ఓడిపోయారు. పార్టీ ఫిరాయింపును ఓటర్లు హర్షించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలాకే జైకొట్టారు.

సాక్షాత్ శ్రీమహావిష్ణువు బద్రినాథుడిగా వెలిసిన ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బద్రినాథ్‌. ఇక్కడ బీజేపీ ఓడిపోవడం చర్చనీయాంశమౌతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వెలువడిన విషయం తెలిసిందే. అయోధ్య అసెంబ్లీ పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ లోక్‌సభ ఎన్నికలో కూడా బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+