మగాళ్లతో సెక్స్ చేస్తూ పట్టుబడి భర్త నాలుక తెగ్గోసి....

మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాదులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మగాళ్లతో పడక గదిలో శృంగారం నెరుపుతూ ఓ మహిళ భర్తకు పట్టుబడింది. దానికి ఏ మాత్రం చింతించకుండా వారి సాయంతో భర్త నాలుక తెగ్గోసింది.

బాధితుడు జితేంద్ర జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని నాలుకకు తొమ్మిది కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది. ఊరు మారితే భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించిన జితేంద్ర ఉన్న ఊరును వదిలి వేరే గ్రామానికి మకాం మార్చాడు.

ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ ఉన్నంతలో ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. కానీ ఓ రోజూ రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన అతడు బెడ్రూంలో దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర, మీనాక్షి భార్యభర్తలు. ఇటీవల తన భార్య ప్రవర్తన నచ్చక ఆమెను తీసుకుని మొరాదాబాద్‌ వలస వచ్చాడు.

After being caught in a compromising position with two men, woman chops off husband's tongue

ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడ ఇటుక బట్టీలో కూలీగా చేరాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. భార్య మీనాక్షి మరో ఇద్దరు పరాయి మగాళ్లతో సన్నిహితంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అప్రమత్తమైన వారు జితేంద్రను బంధించారు.

విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన మీనాక్షి భర్త నాలుకను పదునైన చాకుతో తెగ్గోసింది. తర్వాత అక్కడి నుంచి ముగ్గురూ పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న జితేంద్రను గుర్తించిన ఇరుగుపొరుగువారు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మీనాక్షి పెళ్లికి ముందే విచ్చలవిడిగా తిరిగేదని, ఆ బాధ భరించలేక ఇక్కడకు వచ్చిన తన వక్రబుద్ధిని మార్చుకోలేదని జితేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+