నమో టీ స్టాళ్లే కాదు... ఫిష్ స్టాళ్లూ వచ్చాయి (పిక్చర్స్)
చెన్నై: లోకసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు నమో టీ స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నమో టీ స్టాళ్లకు కౌంటర్‌గా ఉత్తర ప్రదేశ్‌లో రాహుల్ మిల్క్ స్టాళ్లు కూడా వెలిశాయి.
అయితే, నమో టీ స్టాళ్ల తర్వాత ఇప్పుడు చెన్నైలో బిజెపి మరో కొత్త రకం ప్రచారం ప్రారంభించింది. కోద్ది రోజుల క్రితం తమిళనాడులో నమో ఫిష్ స్టాళ్లు వెలిశాయి.
టీ స్టాల్స్, ఫిష్ స్టాల్స్ పేరుతో బిజెపి ఉత్తర, దక్షిణ భారత దేశంలో మోడీ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇది పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రచారం కోసం మోడీ ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే సామాన్యులలోకి బిజెపిని తీసుకెళ్లేందుకు బిజెపి ఇలా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

నమో టీ స్టాల్
తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మంగళవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో నమో ఫిష్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దీనికి అనూహ్య స్పందన లభిస్తోంది.

నమో ఫిష్ స్టాల్
బిజెపి సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాము మత్స్యకారుల కోసం ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేస్తామన్నారు.

మత్స్యకారులకు హామీ
శ్రీలంక నావీ తమిళనాడు మత్స్యకారుల పైన దాడులు చేస్తోందని, వాటిపై దృష్టి సారిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు హామీ ఇస్తున్నారు.

మోడీకి మద్దతు కోసం
మత్స్యకారులు బిజెపికి, నరేంద్ర మోడీకి మద్దతివ్వాలని కోరుతూ తాము ఫిష్ స్టాల్‌ను ఏర్పాటు చేశామని బిజెపి తమిళనాడు శాఖ అధ్యక్షులు సెమ్మలార్ శేఖర్ ఏర్పాటు సందర్భంగా చెప్పారు.

నమో టీ స్టాళ్లు అండ్ ఫిష్ స్టాళ్లు
లోకసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు నమో టీ స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నమో టీ స్టాళ్లకు కౌంటర్‌గా ఉత్తర ప్రదేశ్‌లో రాహుల్ మిల్క్ స్టాళ్లు కూడా వెలిశాయి.

కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు ధీటుగా...
అయితే, నమో టీ స్టాళ్ల తర్వాత ఇప్పుడు చెన్నైలో బిజెపి మరో కొత్త రకం ప్రచారం ప్రారంభించింది. కోద్ది రోజుల క్రితం తమిళనాడులో నమో ఫిష్ స్టాళ్లు వెలిశాయి.












Click it and Unblock the Notifications