చంద్రబాబు ఐటి షాపింగ్: సిద్ధరామయ్య ఉలికిపాటు

బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బెంగళూరు పర్యటన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉలిక్కిపడేలా చేసింది. ఐటి కంపెనీలకు చంద్రబాబు స్వాగతం చెప్పి వాటి నుంచి సానుకూల ప్రతిస్పందన పొందడంతో సిద్ధరామయ్య నష్ట నివారణ చర్యలకు దిగారు. ప్రతిష్ఠాత్మకమైన హీరో కంపెనీ ఇప్పటికే ధార్వాడా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లింది. తాజాగా ఇన్ఫోసిస్‌ కూడా కర్ణాటక అధికారుల తీరుతో విసిగి తట్టా బుట్టా సర్దుకునేందుకు సిద్ధమ వుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాణిజ్య, ఐటి శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐటి,బిటి కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని, భూ కేటాయింపులతో సహా అన్ని వ్యవహారాలను సత్వరమే చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫోసిస్‌కు స్థలం కేటాయింపులో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్థం కావడం లేదని సిఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చేతకాకపోతే తక్షణం వెళ్లిపోవాలని సూచించారు. చేతకాని అధికారులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు.

 After Chandrababu Naidu's IT shopping, Siddaramaiah is on a salvage mission

ఆంధ్రప్రదేశ్‌ రాయితీలతో తమ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని, అయితే ఇక్కడి నుంచి ఒక్క కంపెనీ కూడా అటువైపు వెళ్లదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి పలు ఐటి కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయని సిద్ధరామయ్య చెప్పారు. హనీవెల్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ సంస్థ తన విస్తర ణ కోసం 5.4 ఎకరాల భూమి కోరిందని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ భూములను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చామని చెప్పారు.

దేవనహళ్లి ఐటి పార్కుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని సిద్ధరామయ్య ఇన్ఫోసిస్‌కు హామీ ఇచ్చారు. దానికితోడు ఆంధ్రప్రదేశ్ ఇవ్వజూపిన ఆర్థిక రాయితీలు సమర్థనీయం కాదని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి మీడియా ద్వారా సంకేతాలను ఇచ్చారు.

దేవనహళ్లి ఐటి పార్కుకు, విమానాశ్రయానికి మధ్య ఫోర్ లైన్ రోడ్డు వేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇన్ఫోసిస్ చేసిన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తామని సిద్ధరామయ్య గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇప్పటికే 70 శాతం రోడ్డు పనులు పూర్తయ్యాయని, మిగతా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి, మంచినీటి సౌకర్యం కల్పించే పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తవుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+