చైనా అంటే సరే- చివరికి అదాని అంటే కూడా మోదీకి భయమేనా..!!

అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై మాట్లాడటానికి ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా చెలరేగిన దుమారం తగ్గట్లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. ఈ అంశాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోన్నారు. ఏదో ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అదాని-హిండెన్ బర్గ్ అంశంపై మాట్లాడుతూనే ఉన్నారు.

 పార్లమెంట్ లో..

పార్లమెంట్ లో..

హిండెన్ బర్గ్ నివేదిక- పార్లమెంట్ లో ఏ స్థాయిలో వాగ్వివాదానికి దారి తీసిందో తెలిసిన విషయమే. ఈ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని అపాయింట్ చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రాహుల్ గాంధీ- ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రసంగించారు. జేపీసీ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై ఎదురుదాడికి దిగిందే తప్ప జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి అంగీకరించట్లేదు.

సుప్రీంకోర్టులోనూ..

సుప్రీంకోర్టులోనూ..

చివరికి ఈ అంశం అటు దేశ అత్యున్నత న్యాయస్థానానికి సైతం చేరింది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. మలి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

 అదాని పేరెత్తకుండా..

అదాని పేరెత్తకుండా..

పార్లమెంట్ లో తన ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఎక్కడే గానీ అదాని పేరెత్తలేదు. ప్రతిపక్షాలపై ఎదురుదాడిని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు చోటు చేసుకున్నాయంటూ కౌంటర్ అటాక్ చేశారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసిందంటూ విమర్శించారు. ప్రధాని-అదాని భాయ్ భాయ్ అంటూ ప్రతిపక్షాలు చేసిన నినాదాలను ఆయన తిప్పి కొట్టారు.

 ఒవైసీ ఫైర్..

ఒవైసీ ఫైర్..

తాజాగా- అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. తాజాగా ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. చైనా పేరు ఎత్తడానికి మోదీ భయపడేవారని, ఇప్పుడు అదాని పేరును ప్రస్తావించడానికి కూడా ఆయన జంకుతున్నారని ధ్వజమెత్తారు. హిండెన్‌ బర్గ్ నివేదిక తరువాత అదానీ 40 శాతం సంపదను కోల్పోయాడని, దీనికి సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతోందని ఆరోపించారు.

హిండెన్ బర్గ్ పై..

హిండెన్ బర్గ్ పై..

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం మీడియాపై దాడులకు పాల్పడుతోందని ఒవైసీ మండిపడ్డారు. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను ఆయన తప్పు పట్టారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. అధికార పక్షానికి అనుకూలంగా వార్తలు రాయడం, ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలను పట్టించుకోకపోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో అప్పుడే కాదు.. ఇప్పుడూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+