షాక్: ఎల్‌పీజీ తర్వాత కిరోసిన్ సబ్సిడీపై కోత
ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం కన్పిస్తోంది. కిరోసిన్ సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్లాన్ సిద్దం చేస్తోందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం కన్పిస్తోంది. కిరోసిన్ సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్లాన్ సిద్దం చేస్తోందని తెలుస్తోంది.
గ్యాస్ సిలిండర్‌పై కోత మాదిరిగానే కిరోసిన్‌పై సబ్సిడీని కూడ తగ్గించాలని యోచిస్తోంది. ఇంధనాల మార్కెట్ ధరలను సమాజంలోని పేద వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే లక్ష్యంతో చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నట్టు సమాచారం.

సబ్సిడీ కిరోసిన్ ధరలను ప్రతి పదిహేను రోజులకు 25 పైసలు పెంచాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా సబ్బిడీని తొలగించేంత వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు దీన్ని అమలు చేయాలని కోరింది.
సబ్సిడీల్లో కోత పెట్టి వినియోగ వస్తువుల ధరలను మార్కెట్ ధరల స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎల్‌పీజీకి మారడానికి వినియోగదారులను ప్రోత్సహిండచంతో పాటు కాలుష్య నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేశాయి.
అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు దీనిపై భారీ సబ్సిడీ అమలుచేస్తున్న డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2016-17లో 66 శాతం క్షీణించిన కిరోసిన్ వినియోగం 78,447 లీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ, చంఢీఘడ్ కిరోసిన్ ఫ్రీ నగరాలుగా ఉన్నాయి.
కాగా, మార్చి 2018 నాటికి వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే వ్యూహంలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 4 చొప్పున పెంచాలని జూలై 31న, ప్రభుత్వం ఆదేశించింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications