ఫేక్ వ్యాక్సిన్ తీసుకుని కుప్పకూలిన టీఎంపీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి: ఒక్కరు కాదు వందలాది మంది!

కోల్‌కతా: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలోనూ నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులతోపాటు ప్రముఖులను కూడా బురిడీకొట్టిస్తున్నారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తి కూడా నకిలీ వ్యాక్సిన్ తీసుకుని అస్వస్థతకు గురయ్యారు.

మిమి చక్రవర్తికి తీవ్ర అస్వస్థత..

మిమి చక్రవర్తికి తీవ్ర అస్వస్థత..

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఫేక్ వ్యాక్సిన్ తీసుకున్నారు మిమి చక్రవర్తి. ఆ తర్వాత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న చక్రవర్తికి తీవ్రమైన డీహైడ్రేషన్, తక్కువ రక్తపోటు(లో-బీపీ), కడుపు తిమ్మిరి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

నకిలీ వ్యాక్సిన్ తీసుకుని కుప్పకూలిన మిమి చక్రవర్తి

నకిలీ వ్యాక్సిన్ తీసుకుని కుప్పకూలిన మిమి చక్రవర్తి

జాదవపూర్ నుంచి ఎంపీగా గెలిచిన మిమి చక్రవర్తి శుక్రవారం సాయంత్రం నుంచి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత తీవ్రంగా చెమటలు పట్టి ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. కాగా, ఇప్పటికే మిమి చక్రవర్తికి పిత్తాశయం, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ తెలిపారు.

చక్రవర్తితోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వందలాది మంది.

చక్రవర్తితోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వందలాది మంది.

మిమి చక్రవర్తి.. నకిలీ వ్యాక్సిన్ కేంద్రం నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు కోల్‌కతా పోలీసులు.. కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సిన్ కేంద్రం నిర్వహిస్తున్న దేవాంజన్ దేవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అనేక మందిని నమ్మించి నకిలీ వ్యాక్సిన్ కేంద్రాలకు రప్పించాడని పోలీసులు తెలిపారు. అంతేగాక, నిందితుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకున్నాడని వెల్లడించారు. కాగా, చక్రవర్తితోపాటు మరో 100 మందికిపైగా ఈ నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

దుమ్మూ ధూళితో నిండిన వయల్స్.. ఫేక్ వ్యాక్సిన్ కేంద్రం సీజ్

దుమ్మూ ధూళితో నిండిన వయల్స్.. ఫేక్ వ్యాక్సిన్ కేంద్రం సీజ్

నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత కేంద్రంలోని పలు రకాల వ్యాక్సిన్ వయల్స్‌ను చేసినట్లు చెప్పారు. వయల్స్ కూడా దుమ్ము ధూళితో నిండివున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలోని పరికరాలు, మందులను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో అమికాసిన్ ఇంజెక్షన్లను పోలీసులు కనుగొన్నారు. అంతేగాక, నిందితుడి కార్యాలయంలో కోవిషీల్డ్ నకిలీ లేబుళ్ళను కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో నకిలీ వ్యాక్సిన్ కేంద్రాల గుట్టురట్టు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+