దీన్ని అరెస్ట్ చేయండి: మహిళా జర్నలిస్ట్‌ను తిట్టిన ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఓ మీడియాకు చెందిన మహిళా ప్రతినిధిని కర్నాటక ఎమ్మెల్యే అశోక్ ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. ఓ సమాచారానికి సంబంధించి ఆమె ఆయనను ప్రశ్నించగా... దీనిని అరెస్టు చేయండి అని అసభ్య పదజాలం ఉపయోగించాడు. ఈ నేపథ్యంలో లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో కన్నడ నాట ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది. రూ.5 కోట్లిస్తే మా ఓటు మీకేనంటూ తమను సంప్రదించిన వైరి పక్షాల నేతలకు చెప్పిన ఆ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు స్టింగ్ ఆపరేషన్‌కు అడ్డంగా దొరికిపోయారు.
ఈ క్రమంలో అక్కడ ఎన్నికలను వాయిదా వేయాలన్న దిశగానూ కేంద్ర ఎన్నికల సంఘం యోచించింది. అయితే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించేందుకే ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో స్టింగ్ ఆపరేషన్‌కు దొరికిపోయిన స్వతంత్ర ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ఓ మహిళా జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు.

స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన తనను ప్రశ్నించిన ఓ మహిళా జర్నలిస్టుపై ఆయన దుర్బాషలాడారు. ఈ వీడియో కూడా నేషనల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'అరెస్టడ్ కరో సాలీకో' (దీనిని అరెస్ట్ చేయండి) అని అసభ్యంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా వీడియోలో రికార్డ్ అయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలోకి ఎక్కాయి.
ఈ విషయాన్ని తాము అంత తేలిగ్గా వదిలేది లేదని, ఓ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి భాష ఉపయోగించి మాట్లాడాడో అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు టైమ్స్ నౌ మీడియా సంస్థ తెలిపింది. చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మాట్లాడుతూ.. సదరు ఎమ్మెల్యే లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications