భర్త ముందే ప్రియుడిని పెళ్ళిచేసుకొన్న భార్య

వివాహం జరిగినా భర్త చాటుగా ప్రియుడితో ప్రేమాయణం సాగిస్తోన్న ఓ వివాహితకు గ్రామపెద్దలు భర్త ఎదుటే ప్రియుడితో వివాహం జరిపించారు.

పాట్నా :వివాహమైంది. అయినా ప్రియుడితో సంబంధాలను కొనసాగిస్తోంది. సోదరుడినంటూ ప్రియుడు ఏకంగా ప్రియురాలు ఇంటికి రాకపోకలు సాగించాడు. ఎట్టకేలకు వారి మద్య వ్యవహరం బట్టబయలైంది. దీంతో భర్త ఎదుటే భార్యకు ప్రియుడితో వివాహం జరిపించారు గ్రామపెద్దలు.

బీహార్ లో గ్రామపెద్దలు తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.భర్త ఎదుటే ప్రియుడితో భార్య వివాహం జరిపించారు.పాట్నాకు సమీపంలోని మోతీపూర్ లో ఘటన చోటుచేసుకొంది.

ఎనిమిది నెలల క్రితం మోతీపూర్ గ్రామానికి చెందిన యువకుడితో ఆ మహిళకు వివాహమైంది. అయితే ఈ వివాహానికి ముందే ఆమె మరోక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టింది. తల్లదండ్రులు మోతీపూర్ కు చెందిన యువకుడితో ఆమె వివాహం చేశారు.

after marrage wife continues affair with lover, villagers marry her with lover

వివాహమై ఆమె అత్తింటికి వెళ్ళినా కాని, ప్రియుడు తరచూ ఆమె వద్దకు వచ్చేవాడు. వరుసకు సోదరుడిని అవుతానని అత్తింటివారికి చెప్పాడు.దీంతో వారికి ఎలాంటి అనుమానం రాలేదు.ఆమె ఎక్కువసేపు ప్రియుడితో పోన్ లో మాట్లాడేది. అత్తింటివారు అడిగితే తన పుట్టింటివారితో మాట్లాడుతున్నట్టు నమ్మించేది.

ఈ నిజం ఎట్టకేలకు బట్టబయలైంది. రెండు రోజుల క్రితం తన అత్తింటిలో ప్రియుడితో ఆమె గడుపుతుండగా భర్త చూశాడు. దీంతో గ్రామస్థులు వారిని పట్టుకొని కొట్టాడు. ఆ యువతి తల్లిదండ్రులకు కూడ సమాచారం ఇచ్చారు.రెండు కుటుంబాల పెద్దలు పంచాయితీ నిర్వహించారు. భర్తతో తాను కాపురం చేయలేనని ప్రియుడితో కలిసి ఉంటానని ఆ యువతి తేల్చి చెప్పింది.దీంతో వెంటనే భర్త ఎదుటే ఆ యువతికి ప్రియుడితో వివాహం జరిపించారు ఆ గ్రామ పెద్దలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+