ఉల్లితో పోటీ పడుతున్న టమోటా: భారీగా పెరుగుతున్న ధరలు..!
పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి వరకు నిరంతరం పెరుగుతున్న పెట్రో ధరలతో జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇక , కొద్ది రోజులు ఉల్లి ధర ఆకాశమే హద్దుగా పెరిగి పోతోంది. అయితే స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే అవి తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో టమోటా ధర సైతం ఒక్క సారిగా పెరిగిపోయింది. ఢిల్లీ..నోయిడా ప్రాంతాల్లో కిలో టమోటా ధర రూ 40కి పైగా పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొనేందుకు స్థానిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా..వ్యాపారలు మాత్రం డిమాండ్ ను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
గత ఏడాది ధరలతో పోల్చుకుంటే రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. మహారాష్ట్ర..కర్నాటక..ఉత్తరాది ప్రాంతాల్లో కూరగాయల ధరలు సైతం ఒక్క సారిగా పెరిగిపోయాయి. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగిందని..ఫలతంగా ధరలు పెరగాయని చెబుతున్నారు. ఇక, ఏపీ..తెలంగాణల్లో పెరిగిన ఉల్లి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు ఫోకస్ చేసాయి. అందులో భాగంగా ఏపీలో రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ 25కు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఢిల్లీలోని అజాద్ పూర్ మండిలో 25 కిలోల టమోటా బ్యాగ్ రూ 800 వరకు పలుకుతోంది. అధికారులు మాత్రం కిలో టమోలా రూ 8 గా ఉందని..ఇప్పుడు అది రూ 34 వరకు చేరిందని చెబుతున్నారు. వ్యాపారులు మాత్రం రూ 40 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. చండీఘర్ ప్రభుత్వ లెక్కల ప్రకారం కిలో ఉల్లి రూ 52కు చేరింది.
ఒక వైపు పెరుగుతున్న ధరలు..మరో వైపు పండుగ సీజన్ కావటంతో సామాన్య ప్రజలు అధిక ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క సారిగా పెరుగుతున్న నిత్యావసర ధరల పైన ఫోకస్ చేయాలని సామాన్యులు కోరుతున్నారు. నిత్యం సామాన్య ప్రజలు వినియోగించే ఉల్లి..టమోటా ధరలు ఇలా పెరిగిపోవటం పైన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications