ప్రణబ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఒకే వేదికపై రతన్ టాటా, మోహన్ భగవత్
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తోపాటు ముంబైలో వచ్చే నెల జరగనున్న ఓ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోనున్నారు
రతన్ టాటా, భగవత్ ఆగస్టు 24న ముంబైలో నానా పాల్కర్ స్మృతి సమితి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సంఘ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంఘ్ ప్రచారక్ నానా పాల్కర్ పేరిట ఈ ఎన్జీవో ఏర్పాటైంది.

ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి సమీపంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ప్రాంగణం నుంచే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సమితి సేవలందిస్తోంది. రతన్ టాటా తమ ప్రాంగణాన్ని సందర్శించారని, సంస్థ కార్యకలాపాల గురించి ఆయనకు అవగాహన ఉందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వెల్లడించారు.
జూన్‌లో నాగపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తర్వాత రతన్ టాటా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications