కొనసాగుతున్న కాంగ్రెస్ సంక్షోభాలు-ఈసారి జమ్మూ కశ్మీర్లో అంతర్గత పోరు-అజాద్ వర్సెస్ పాటిల్
కేంద్రంలో అధికారం కోల్పోయి ఏడేళ్లు దాటిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం సాధించడం సంగతేమో కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో పరిస్ధితులు చేయిదాటి పోతున్నాయి. ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో అంతర్గత సంక్షోభం తెరపైకి వస్తోంది.
కశ్మీర్లో సీనియర్ నేత, జీ 23 అసంతప్తి నేతల్లో ఒకరైన గులాం నబీ అజాద్ కు వ్యతిరేకంగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ ఇన్ ఛార్జ్ గా నియమితులైన రజనీ పాటిల్, ఆమె మద్దతుదారులు ఆజాద్ కు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జమ్మూ, కాశ్మీర్‌లో విభజనను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె గులాం నబీ ఆజాద్, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మీర్, కేంద్ర పాలిత ప్రాంతానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్, రజనీ పాటిల్, ఇతర నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అజాద్ కు బీజేపీతో బంధం పెరుగుతుండటం, బీజేపీ నేతలు అజాద్ పై సందర్భం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తుండటం, అదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వంపై ఆజాద్ అసంతృప్తి చర్యలు ఆయన్ను పార్టీకి దూరం చేస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంత ఇన్ ఛార్జ్ రజనీ పాటిల్ ఆజాద్ అనుచరుల దూకుడు అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడ కాంగ్రెస్ సంక్షోభానికి కారణమవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మద్దతుదారులు తాజాగా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దాదాపు 20 మంది, కాంగ్రెస్ అసమ్మతివాదులలో ఎక్కువగా స్థానిక పార్టీ కార్యకర్తలు, మాజీ మంత్రులు మరియు కాశ్మీర్ లోయ మరియు జమ్మూ ప్రాంతానికి చెందిన ప్రభావవంతమైన నాయకులు ఉన్నారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని పునర్విభజన కమిషన్ 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. మార్చి 2022లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ ఎన్నికలతో పాటు లేదా మే 2022లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.
దీంతో అజాద్ బలం, కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లాతో ఆయన సాన్నిహిత్యం తెలిసిన సోనియాగాంధీ దూకుడు నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నారు. దీంతో ఎన్నికల లోపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications