జైలుకెళ్లిన 'బాబా రాంపాల్'.... ఇప్పుడు 'డేరా బాబా'పై పోలీసుల కన్ను...?
న్యూఢిల్లీ: హర్యానాలో వివాదస్పద సంత్ రాంపాల్ తర్వాత ఇప్పుడు పోలీసుల కన్ను గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరాపై పడింది. హర్యానాలోని హిసార్‌లోని బాబా రాంపాల్ అక్రమాలు, ప్రజలను మోసగించడం, ప్రైవేటు సైన్యాన్ని నిర్వహించడం లాంటి ఆరోపణలతో హర్యానా పోలీసులకు, బాబా మద్దతుదారులకు జరిగిన పోరులో చివరకు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులకు, బాబా రాంపాల్ మద్దతుదారులకు జరిగిన పోరులో ఆరుగురు మరణించారు.
ఈ క్రమంలో బాబా రాంపాల్ రాసలీలలు గురించి తెలుసుకున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత డేరా సచ్ఛా సౌధ మతాధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబాపై దృష్టి సారించాయి. బాబా రాంపాల్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆశ్రమంలో ఉ్న ఆయన ప్రైవేటు సైన్యం దాడులకు దిగిన విషయం తెలిసిందే.

బాబా రాంపాల్ అరెస్టు తర్వాత ఆశ్రమం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో, డేరా బాబా ఆశ్రమంలో ఆయుధాలున్నాయేమో తెలుసుకునేందుకు ముందుగా సోదాలు చేయాలని హర్యానా హైకోర్టు భావిస్తోంది.
కొందరు మాజీ సైనికాధికారులు డేరా బాబా ఆశ్రమంలో ప్రైవేట్ కమాండోలకు శిక్షణ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటు, డేరా బాబాపై గతంలో నమోదైన అత్యాచారం, హత్య కేసులపై పునర్విచారణ చేపట్టాలని హర్యానా హైకోర్టు బెంచ్ నిర్ణయించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications