గోవా కాంగ్రెస్ కుమరో ఎదురుదెబ్బ!: 'ఆ నిజం ఒప్పుకోవాల్సిందే'..

Subscribe to Oneindia Telugu

గోవా: గోవా కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే రాజీనామా చేసి 24గం. గడవకముందే మరో ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యే రోడ్రిగ్స్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

గోవా ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ.. పార్టీ పెద్దల అలసత్వం వల్లే కాంగ్రెస్ కు ఈ దుస్థితి ఏర్పడిందని రోడ్రిగ్స్ పరోక్షంగా ఆరోపించారు. పార్టీ పట్ల గానీ, పార్టీ ఎమ్మెల్యేల పట్ల గానీ గోవా కాంగ్రెస్ పెద్దలకు ఏమాత్రం శ్రద్ద లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విఫలమైందన్న నిజాన్ని పార్టీ పెద్దలు ఒప్పుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.

After Rane, Savio Rodrigues resigns from Congress

మొత్తం మీద రోడ్రిగ్స్ చేసిన ఆరోపణలు గోవా కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. కాగా, గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు 10స్థానాలు గెలుచుకున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాత్రం కాంగ్రెస్ విఫలమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after Vishwajit Rane resigned from the Congress, another senior leader, Savio Rodrigues quit the party on Friday. Rodrigues took to Twitter to announce his decision to quit the Congress. Rodrigues was the vice president of the Congress' minority wing in Goa.
Please Wait while comments are loading...