ఇలా కలిపారు: రష్యా కోడలు-యూపీ అత్త, మధ్యలో సుష్మా, అఖిలేష్!

Subscribe to Oneindia Telugu

లక్నో: ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు కోడలిగా వచ్చిన ఓ రష్యను మహిళ చేసిన ధర్నాకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. కేంద్రమంత్రి విజ్ఞప్తి మేరకు స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రంగంలోకి దిగి రష్యా కోడలు, ఆగ్రా అత్తను మళ్లీ కలిసిపోయేలా చేశారు.

దీంతో ఆగ్రాలోని తన అత్త ఇంటిముందు నిరాహార దీక్ష చేపట్టిన రష్యా కోడలు ఓల్గా ఎఫిమెంకోవా కథ సుఖాంతమైంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ల చొరవతో ఆమెను అత్త ఆదివారం సాయంత్రం ఇంట్లోకి ఆహ్వానించింది.

After Sushma Swaraj Tweets Akhilesh Yadav, Russian Woman 'United' With Family

ధర్నాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2011లో ఆగ్రాకు చెందిన విక్రాంత్‌, రష్యాకు చెందిన ఓల్గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కూతురు ఉంది. వరకట్నం ఇవ్వనందున తనును ఇంట్లో ఉండనివ్వడం లేదని ఓల్గా, తన భర్త విక్రాంత్‌, కూతురుతో కలిసి అత్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు.

కాగా, అత్త నిర్మలా చాందెల్‌ మాత్రం కోడలు పద్ధతి సరిగా ఉండటం లేదని ఆరోపించారు. మద్యం, డ్రగ్స్ తీసుకుంటోందని, ఖర్చులు అధికంగా చేస్తోందని నిర్మల ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌ స్పందించారు. ఈ విషయంలో చొరవ చూపి ఆమెను కుటుంబంతో కలపాలని సుష్మా స్వరాజ్‌.. ఉత్తరప్రదేవ్ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను కోరారు.

దీంతో వెంటనే స్పందించిన అఖిలేష్ రంగంలోకి దిగారు. అత్తకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో ఆమె తన రష్యా కోడలు, కొడుకు, మనవరాలిని ఇంట్లోకి ఆహ్వానించిందని.. ఓల్గా కుటుంబంతో కలిసిన ఫొటోను అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అఖిలేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సుష్మ మరో ట్వీట్‌ చేశారు. కాగా, అదే ఇంట్లోనే నిర్మలా చాందెల్ కూతురు కుటుంబం కూడా ఉంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Russian woman in Agra, who had accused her in-laws of harassment was "united" with her family on Sunday evening after an intervention by External Affairs Minister Sushma Swaraj and Uttar Pradesh Chief Minister Akhilesh Yadav.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి