Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tamarind: టమాటా, అల్లం, పచ్చి మిర్చి, ఉల్లి.. ఇప్పుడు చింతపండు.. భయపెడుతున్న ధర..

సామాన్యులకు టమాటా, పచ్చి మిర్చి తర్వాత ఇప్పుడు చింతపండు షాకిస్తోంది. మార్కెట్ లో చింతపండు ధరలు భారీగా పెరిగాయి.రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించే చింత పండు ప్రస్తుతం రూ.120 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. చింతపండుకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన కర్ణాటకలోని తుమకూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలో టోకు ధరలు కూడా భారీగా పెరిగాయి.

కిలో రూ. 100 దాటిన టమాటాకు ప్రత్యామ్నాయంగా చింతపండును వాడడమే చింతపండుకు డిమాండ్‌, ధర పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. "మేము చింతపండుకు అసాధారణమైన డిమాండ్‌ను చూస్తున్నాము. గత జూలైతో పోలిస్తే ఈ నెలలో 40% ఎక్కువ డిమాండ్‌ ఉంది" అని తుమకూరు ఏపీఎంసీ హోల్‌సేల్‌ వ్యాపారి శరత్‌కుమార్‌ తెలిపారు. తుమకూరు ఏపీఎంసీ సహాయ కార్యదర్శి లక్ష్మీకాంతం మాట్లాడుతూ జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య చింతపండు కొనుగోళ్ల సీజన్‌ జరుగుతుందన్నారు.

vegitablespricehike1

శీతల గిడ్డంగులలో తక్కువ మొత్తంలో చింతపండు నిల్వ చేసిన రైతులు, మంచి ధర పొందడానికి అన్ సీజన్‌లో తమ స్టాక్‌ను విడుదల చేస్తారు. తుమకూరు ఏపీఎంసీలో పీక్ సీజన్‌లో రోజుకు సగటున 260 నుంచి 300 క్వింటాళ్ల చింతపండు కొనుగోలు అవుతుంది. జులై 19న 98 క్వింటాళ్లు క్వింటాలుకు రూ.14 వేల చొప్పున కొనుగోలు చేయగా, గతేడాది ఇదే తేదీన క్వింటాలుకు రూ.1,720 చొప్పున కొనుగోలు చేశారు.

ఉద్యానవన శాఖ అందించిన సమాచారం ప్రకారం, 2018లో చింతపండు 12,173 హెక్టార్లలో సాగు చేయగా, 58,000 టన్నుల దిగుబడి వచ్చింది. 2021-22లో రాష్ట్రంలో 10,508 హెక్టార్లలో చింతపండు సాగు చేయగా 40,068 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. చింతపండును పండించే మొదటి ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక స్థానం ఒకటిగా ఉంది. గత రెండు పంటల సీజన్‌లో అధిక వర్షాలు, వేడిమి కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. తనకున్న ఎనిమిది ఎకరాల్లో సగటున 30 నుంచి 35 క్వింటాళ్లు వచ్చేదని... గత రెండేళ్లలో గరిష్టంగా 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు.

"తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో శీతల గిడ్డంగులు ఉన్నాయి. అక్కడ వ్యాపారులు పెద్ద మొత్తంలో చింతపండును నిల్వ చేసి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విక్రయిస్తారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు" అని హిరేహళ్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంత్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+