వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎప్పుడూ 'సెక్స్' మాటలే, అశ్లీల వీడియోలతో వేధింపులు: స్కూప్ వూప్ సీఈవోపై కేసు

సంస్థలో పనిచేస్తున్న సమయంలో తరుచూ సెక్స్ గురించే మాట్లాడేవాడని, ఆ సమయంలో తనకు అశ్లీల వీడియోలు పంపించాడని తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంస్థలో పనిచేసిన ఉద్యోగినిని లైంగికంగా వేధించాడన్న కారణంగా స్కూప్ వూప్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుపర్ణ్ పాండేపై కేసు నమోదైంది.గతంలో ఇదే సంస్థలో పనిచేసిన ఒక మహిళా ఉద్యోగిణి సీఈవోపై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

అసభ్యంగా మాట్లాడటమే గాక, ఎక్కడపడితే అక్కడ మహిళలను తాకేవాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అశ్లీల వీడియోలు పంపించి వేధించేవాడని వాపోయింది. సంస్థలో పనిచేస్తున్న సమయంలో తరుచూ సెక్స్ గురించే మాట్లాడేవాడని, ఆ సమయంలో తనకు అశ్లీల వీడియోలు పంపించాడని తెలిపింది.

After TVF's Arunabh Kumar, ScoopWhoop co-founder Suparn Pandey accused of sexual harassment

మహిళా ఉద్యోగిణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వసంత్ కుంజ్ పోలీసులు పాండేపై 354ఏ(లైంగిక వేధింపులు), 509(మహిళ గౌరవానికి భంగం కలిగించడం) 506(నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.

కాగా, కేసును ఎలాగైనా మూసివేయించాలని స్కూప్ వూప్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మహిళా ఉద్యోగిణి ఆరోపించారు. గతంలో వైరల్ ఫీవర్(టీవిఎఫ్) అనే డిజిటల్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ సీఈవో అరుణబ్ కుమార్ మీద కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.

English summary
A former senior executive of ScoopWhoop Media Pvt Ltd has filed an FIR against co-founder Suparn Pandey accusing him of sexual harassment and sexual assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X