దూకుడు పెంచిన బీఎస్ఎన్ఎల్.. 5జీ సేవలు, కొత్త లోగోతో అదిరిపోయే ఫీచర్స్ లాంచ్!
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా కొత్త లోగోను ఆవిష్కరిస్తూ.. మంగళవారం ( అక్టోబర్ 22) ఏడు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీంతో ప్రముఖ ప్రయివేటు పోటీదారుకు గట్టి షాక్ ఇచ్చినట్లయిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏడు కొత్త BSNL సేవలు లాంచ్..
ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో బీఎస్ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలపై వినియోగదారుల నుంచి సానుకూల స్పందన రావడంతో మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రాణాళిక వేస్తోంది. ఇందులో భాగంగా అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు స్పామ్ ఫ్రీ నెట్ వర్క్‌ను వంటి సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. సెంట్రల్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్, వై-ఫై రోమింగ్, డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీతో సహా ఏడు కొత్త BSNL సేవలను లాంచ్ చేశారు.

డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్..
అంతేకాదు, 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఫైబర్ టీవీ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది ఇప్పటికే ఫైబర్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్‌లుగా ఉన్న వినియోగదారులకు అదనపు చెల్లింపులు లేకుండా అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్‌లను లాంచ్ చేస్తోంది. వీటితోపాటు దేశంలోనే మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్‌ను ప్రారంభించి ఔరా అనిపించింది. ఈ కనెక్టివిటీ సొల్యూషన్ శాటిలైట్, మొబైల్ నెట్ వర్క్‌లను అనుసంధానం చేస్తుంది. ఈ సర్వీస్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications