కుక్కను వెతికిపెట్టరూ.. ప్లీజ్ : ఎంపీ భార్య ఫిర్యాదు
ఆగ్రా : చేతిలో అధికారముంటే.. ఫిర్యాదులూ గారాలు పోతాయేమో! లేకపోతే ఉత్తరప్రదేశ్ పోలీసులకు కుక్కల వెంటా..! పశువుల వెంటా..! పడే పరిస్థితేంటి? తాజాగా ఓ ఎంపీ గారి భార్య తప్పిపోయిన తన పెంపుడు కుక్కను వెతికి పెట్టాలని ఉత్తరప్రదేశ్ లోని హరిపర్వత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆగ్రా బీజేపీ ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల శుక్రవారం నాడు ఈ కుక్క మిస్సింగ్ కేసుపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకుని స్థానికి ఎస్పీకి ఫిర్యాదు చేశారు మృదుల.

మూడు రోజుల క్రితం తమ కుక్క కొంతమంది గుర్తు తెలియని దుండగుల చేతిలో అపహరణకు గురైందని మృదుల ఫిర్యాదులో పేర్కొన్నారు. లాబ్రాడర్ జాతికి చెందిన ఆ కుక్క చాలా ఖరీదైనదని, నలుపు రంగులో ఉంటుందని తప్పిపోయిన కుక్క గురించి వివరించారు మృదుల. తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా ఆ కుక్క కలిసిపోయిందని.. కాబట్టి ఎలాగైనా ఆ కుక్కను వెతికి పట్టుకోవాలని హరిపర్వత్ పోలీసులను కోరింది ఎంపీ భార్య.












Click it and Unblock the Notifications