• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోనియాకు సీనియర్ల ఘాటు లేఖ - కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన - రేపు సీబడ్ల్యూసీ అనగా..

|

నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాసక్తత.. గాంధీయేతర వ్యక్తినే సారధిగా నియమించాలన్న ప్రియాంక కామెంట్లు.. ప్రస్తుత చీఫ్ సోనియా గాంధీ వృధ్యాప్య సమస్యలు.. వెరసి జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొన్నవేళ 23 మంది సీనిర్ నేతలు అధినేత్రికి ఘాటు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి ఒక్కరోజు ముందు పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడున్న నాయకత్వాన్ని మార్చాలని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు 23 మంది సీనియర్లు ఆదివారం ఓ లేఖ రాశారు. అంతేకాదు, పార్టీ తిరిగి పుంజుకునేలా సంస్థాగత యాంత్రాంగాన్ని సంస్కరించాలని, అందులో భాగంగా పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షులవారిని నియమించాలని, దూర దృష్టి, క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి అయితేనే ఆ పదవికి సమర్థుడని లేఖలో పేర్కొన్నారు.

షాకింగ్: కుప్పకూలిన ఫ్లై‌ ఓవర్ - భారీ వర్షమే కారణమట - కేసు కూడా లేదు - ఇద్దరు ఎస్కేప్

ahead of cwc, 23 Congress leaders write to Sonia Gandhi for changes in party

సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్లలో కపిల్ సిబాల్, భూపేందర్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చవాన్, శశిథరూర్, మిలిందర్ దేవరా, జితిన్ ప్రసాద తదిత ప్రముఖులున్నారు. గతంలోనూ ఈ నేతలు సోనియాకు లేఖలు రాశారంటూ వార్తలు వచ్చినా, వారు ఖండిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం కీలక తరుణంలో అధినేత్రికి లేఖ రాయడం గమనార్హం.

అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..

  పోటీ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసనలు! విద్యార్థులూ కంగారు పడొద్దు AICC Secretary Sampath Kumar

  కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సోమవారం సమావేశం కానుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కరోనా మహమ్మారి, చైనాతో సరిహద్దు గొడవలు, దేశ ఆర్థిక పరిస్థితి తదితర అంశాలతోపాటు కీలకమైన నాయకత్వ ప్రతిష్టంభనపైనా సీడబ్ల్యూసీ చర్చించనుంది. సీనియర్ల తాజా లేఖ ద్వారా.. సీడబ్ల్యూసీలో పార్టీ సారధి అంశమే కీలకం కాబోతున్నట్లు వెల్లడైంది.

  English summary
  In an unprecedented move to call for drastic changes in the Congress, 23 top leaders of the party including those from the Congress Working Committee (CWC) have written to Sonia Gandhi over state of affairs in the party. The CWC has called for a meeting on Monday and will be discussing organisational issues. As per sources, the letter will be at the centre of talks.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X