ఎన్నికలకు ముందు...: బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ
కేంద్రమాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు (బుధవారం) తెరదించారు.
న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు (బుధవారం) తెరదించారు.
ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఎస్‌ఎం కృష్ణ గతంలో కర్నాటక ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు కొత్త జర్నీ ప్రారంభం అవుతోందని, బీజేపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

కర్నాటకలోను, జాతీయ రాజకీయాల్లోను తాను గతంలో పలు కీలక పదవులు చేపట్టానని చెప్పారు. వాజపేయి వంటి పలువురు బీజేపీ నేతలతో తనకు అనుబంధం ఉందని చెప్పారు.
ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడంతో కర్నాటకలో తమ పార్టీ మరింత బలపడుతుందని అమిత్ షా అన్నారు. కర్నాటకలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. ఆయన వొక్కలింగ వర్గానికి చెందిన వారు. ఈయన చేరికతో ఆ ఓట్లపై బీజేపీ ఆశ పెట్టుకుంది.












Click it and Unblock the Notifications