సన్నీ లియోన్‌నే మించిపోయిన కేరళ కుట్టి!
Recommended Video

కొచ్చి: అదృష్టం ఉండాలేకానీ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవచ్చు. ప్రియా ప్రకాష్ వారియర్ విషయమే ఇందుకు ఉదాహరణ. ఈ కేరళ కుట్టి అలా కన్నుకొట్టి, ఇలా నవ్విందో లేదో సోషల్ మీడియా షేక్ అయింది.
తన చర్యతో కోట్ల మంది కుర్రకారు గుండెల్ని మాత్రమేకాదు, సెలబ్రిటీలు కూడా నోరు తెరిచి కళ్లప్పగించేలా చేసేసింది ప్రియా వారియర్. రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్ అయిపోయింది. ఏకంగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్‌నే మించిపోయింది.
కేరళ కుట్టికి నెటిజన్లు ఫిదా...
కేరళ కుట్టి ప్రియా ‘ఓరు అదార్ లవ్' మూవీలో నటిస్తున్న సంగతి, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని ఓ సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ప్రియా తన హావభావాలతో నెటిజన్ల మనసు దోచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రాత్రికి రాత్రే...
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా వారియర్ ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా.

సన్నీలియోన్‌ని మించిపోయి...
సోషల్ మీడియాలో ప్రియా వారియర్ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో కూడా ప్రియా.. సన్నీలియోన్‌ని మించినట్లు తేలింది.
ఒక్క సినిమా విడుదల కాకుండానే...
ప్రస్తుతం ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే... 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే పెద్ద స్టార్ అయిపోయింది. ఇంత రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని ప్రియా సంబరపడుతోంది. మరి సోషల్ మీడియానా.. మజాకా?
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications