అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 14మంది దుర్మరణం, ముగ్గురికి సీరియస్

రాజ్ కోట్ : అహ్మదాబాద్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 14మంది అక్కడిక్కడే చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అహ్మదాబాద్ కు సమీపంలోని ధోల్కా తాలుకాలో ఉన్న వాల్తేరా గ్రామ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న మిని ట్రక్కు మరో భారీ ట్రక్కు ఎదురెదురుగా ఢీ కొనడంతో పెను ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

బగోదరా-ఖేడా రహదారిపై శుక్రవారం రాత్రి 11:30గం.ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలియజేశారు. రెండు ట్రక్కులకు సంబంధించిన డ్రైవర్స్ లో.. ఓ డ్రైవర్ తన ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేయబోగా.. ట్రక్కులు రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో మొత్తం 17మంది ప్రయాణిస్తున్న మినీ ట్రక్కులో 14మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

Ahmedabad: 14 killed in road accident near Dholka

మినీ ట్రక్కు ఢీ కొన్నది సిరామిక్ లోడ్ తో వెళ్తున్న భారీ ట్రక్కు కావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. చనిపోయిన వారంతా రాజ్ కోట్ కు సమీపంలోని సోక్డా గ్రామానికి చెందిన మూడు కుటుంబాల వ్యక్తులుగా గుర్తించారు. చనిపోయినవారిలో ఇద్దరు టీనేజీ యువకులు ఉన్నారు. గాయపడిన వారిని తొలుత ధోల్కా ఆసుపత్రి తరలించిన పోలీసులు.. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

ప్రయాణికులంతా పావగడ్ లోని కాళిమాతను దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సందర్బంలో ఈ ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కును ఢీ కొట్టిన సిరామిక్ లోడ్ ట్రక్కు ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి అయిన భూపేంద్ర సింగ్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు చెప్పారు పోలీసులు. గాయపడ్డ ముగ్గురు ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేకపోవడంతో.. వారి పరిస్థితి కొంచెం మెరుగుపడితే గానీ ఘటనకు సంబంధించి
మరిన్ని వివరాలు తెలిసేలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+