వస్త్ర గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం, పేలుళ్లు: 9 మంది మృతి, 12 మందికి గాయాలు

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.

అహ్మదాబాద్‌లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లజ్ రోడ్‌లో ఉన్న ఓ వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం పైకప్పు కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

 Ahmedabad fire: 9 killed as godown collapses after explosion

26 ఫైరింజిన్లతో వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఎల్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+