బస్సు ఎక్కిన స్త్రీపై రేప్: నగ్నంగా ఫొటోలు, ఐదున్నరేళ్లుగా అదే పని...
బస్సు ఎక్కిన ఓ వివాహితపై ఆ బస్సు డ్రైవరే అత్యాచారం చేశాడు. దాంతో ఆగకుండా నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదున్నరేళ్లుగా అత్యాచార పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.
అహ్మదాబాద్ : బస్సు ఎక్కిన ఓ వివాహితపై ఆ బస్సు డ్రైవరే అత్యాచారం చేశాడు. దాంతో ఆగకుండా నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదున్నరేళ్లుగా అత్యాచార పర్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది.
అహ్మదాబాద్ నగరంలోని మేఘనీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు. వివాహిత అహ్మదాబాద్ నుంచి భావనగర్‌కు వెళ్లేందుకు ఓ లగ్జరీ బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆ 32 ఏళ్ల మహిళపై అతను అత్యాచారం చేశాడు.

బస్సులో ఎక్కిన వివాహితపై
బస్సు డ్రైవరు విజయ్ ఠాకూర్ బెదిరించి బస్సులోనే వివాహితపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు. ఆపై నగ్నంగా ఉన్న వివాహిత ఫోటోలు తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదున్నరేళ్ల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

నగ్న ఫొటోలు బయటపెడతానని...
తన మాట విని తన కోరిక తీర్చకుంటే వివాహిత నగ్న చిత్రాలు బయటపెడతానని పదే పదే బెదిరిస్తూ విజయ్ ఠాకూర్ బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఐదున్నరేళ్లుగా ఆమెను మౌంట్ ఆబూ, ధనేరా, అహ్మదాబాద్ నగరాల్లో తిప్పుతూ పలుసార్లు అత్యాచారం చేశాడు.

ఇలా బ్లాక్ మెయిల్...
అత్యాచారానికి గురైన వివాహిత కోరిక తీర్చేందుకు నిరాకరించిన ప్రతిసారీ డ్రైవరు విజయ్ ఠాకూర్ ఆమె ఇంటికి వచ్చి నగ్న చిత్రాలు చూపించి వాటిని బయటపెడతానని బెదిరించి లొంగదీసుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలి ఫిర్యాదుపై డ్రైవరు విజయ్ ఠాకూర్ ను శుక్రవారంం అరెస్టు చేశారు..

చిత్రాలు స్వాధీనం...
ఠాకూర్ వద్ద నుంచి నగ్న చిత్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి కోరుతామని, నగ్న చిత్రాలను అతని నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎిపి పన్నా మోమయా చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications