బెంగళూరు ట్రాఫిక్ కు బిగ్ చెక్

బెంగళూరులో ట్రాఫిక్ ను మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబిలిటీ డిజిటల్ ట్విన్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ముందడుగు పడింది. ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన వర్చువల్ మోడల్ ఇది. బెంగళూరు సిటీ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కింద కోటి రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్ట్ కోసం పోలీస్ శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది.

AI-ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఈ టెక్నాలజీని అందుబాటులోకి రావడం దేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. ఇది అమలులోకి వస్తే బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణ కోసం 'డిజిటల్ ట్విన్' వినియోగిస్తోన్న ప్రపంచ నగరాల సరసన చేరుతుంది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, మాస్కో, బార్సిలోనా వంటి నగరాలు అర్బన్ మొబిలిటీ కోసం డిజిటల్ ట్విన్‌లను ఉపయోగిస్తున్నాయి. AI, మెషిన్ లెర్నింగ్‌ టెక్నాలజీని రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ను నివారించవచ్చు.

AI-Powered Digital Twin in Bengaluru A Game Changer for Traffic Management and Citizen Engagement

ప్రయాణ సమయాలను తగ్గించడం, ప్రమాదాలను నివారించడం, యాక్సిడెంట్ సంభవించినప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ లు సమన్వయపర్చడం వంటి చర్యలకు దోహదపడతాయి. ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉన్నప్పటికీ అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలు వెళ్లడానికి మార్గాలను కల్పించగలుగుతాయని బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి వెల్లడించారు.

మనీకంట్రోల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మొబిలిటీ డిజిటల్ ట్విన్ అనేది బెంగళూరు సిటీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం డేటా ఆధారిత కమాండ్ సెంటర్ గా పని చేస్తుందని అన్నారు. రద్దీ, భద్రతా సమస్యలను రియల్ టైమ్ లో పర్యవేక్షించవచ్చని, వాహనాల రాకపోకలను అంచనా వేయడానికి, వాటిని ఎక్కడికక్కడ డైవర్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని వివరించారు.

బెంగళూరులో ఇప్పటికే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలులో ఉంది. వాహనాల రద్దీని అంచనా వేయడం, వాటి మేనేజ్మెంట్ ప్లానింగ్ కోసం అధునాతన ట్రాఫిక్ సిమ్యులేషన్ సిస్టమ్స్ వంటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డైనమిక్, క్విక్ రెస్పాన్స్ డిజైన్ తో ఎక్కువగా అనుసంధానించారు. సాధారణ ట్రాఫిక్ కు పెద్దగా ఉపయోగపడట్లేదనే అభిప్రాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొబిలిటీ డిజిటల్ ట్విన్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+