జయ మేనకోడలు దీపా దుమ్ములేపింది: రచ్చరచ్చ, రాత్రికి రాత్రే !

జయలలిత మేనకోడలు దీపాకు రాత్రికి రాత్రి అభిమాన సంఘాలు పుట్టుకువచ్చాయి. ఎక్కడ చూసినా జయలలిత, దీపాల ఫోటోలు పెట్టి ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా తీరుపై అన్నాడీఎంకే కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమె జయలలిత ఫోటోలు పెట్టుకుని ఏలా ఫ్లక్సీలు వేసుకుంటారని దీపాను ప్రశ్నిస్తున్నారు.

జయలలిత నిజమైన వారసురాలు నేనే అంటూ కొంత కాలం నుంచి దీపా మీడియా ముందు చెబుతున్నారు. జయలలిత మరణించిన తరువాత రాజాజీ హాల్ లో అమ్మ భౌతికకాయం దగ్గర దీపాను కనీసం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు. దీపాను అక్కడి నుంచి పంపించేశారు.

AIADMK cadres removed the Deepa's supporters banners in Tamil Nadu

మరుసటి రోజు దీపా చెన్నైలోని మెరినా బీచ్ దగ్గరకు వెళ్లి జయలలిత సమాధి దగ్గర పూజలు చేశారు. ఆ సమయంలో మా కుటుంబం జయలలితకు దూరం కావడానికి కారణం అయిన శశికళ (నెచ్చలి శశికళ), అన్నాడీఎంకేకి చెందిన కొందరు నాయకుల బండారం బయటపెడుతానని దీపా మీడియా సాక్షిగా హెచ్చరించారు.

అంతే రాత్రికి రాత్రి దీపా అభిమాన సంఘాలు పుట్టుకువచ్చాయి. దీపా త్వరలో జయ అన్నాడీఎంకే పార్టీని పెడుతున్నారని ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా జయలలిత, దీపాల ఫోటోలు పెట్టి ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.

AIADMK cadres removed the Deepa's supporters banners in Tamil Nadu

జయలలిత, శశికళలతో అన్నాడీఎంకే నాయకులు ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీపా మద్దతుదారులు శశికళ ఫోటోలో ఉన్న ఫ్లక్సీల మీద మసి పూసి, నల్ల రంగు వేసి నిరసన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న శశికళ మద్దతుదారులు, అన్నాడీఎంకే కార్యకర్తలు జయ మేనకోడలు దీపా ఉన్న ఫ్లక్సీలను తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల దీపా ఫోటోలు ఉన్న ఫ్లక్సీలు కోసివేసి ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AIADMK cadres removed the Deepa's supporters banners in Tamil Nadu

మొత్తం మీద రాత్రికి రాత్రే జయలలిత మేనకోడలు దీపాకు అభిమాన సంఘాలు ఏర్పడటంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీపా వలన ఇప్పటి వరకు అన్నాడీఎంకేకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ముందు ముందు ఆమె ఆ పార్టీకి తలనొప్పిగా మారుతారా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+