అధికార పార్టీ ఆంటీ హైటెక్ వ్యభిచారం, బెంగళూరు అమ్మాయిలు, ఏం కావాలి? ఎంత కావాలి ?, కేసుల్లేవ్!
చెన్నై/ఆంబూరు: బెంగళూరు నగరంలోని యువతులను పెట్టుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న అధికార పార్టీ మాజీ కో ఆపరేటీవ్ సహకార సంఘాల అధ్యక్షురాలిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తనను వ్యభిచారం కూపంలోకి దింపారని, రూ. 40 వేలు చెల్లించుకుండా టార్చర్ పెడుతున్నారని బెంగళూరుకు చెందిన మహిళ ఫిర్యాదు చెయ్యడంతో అధికార పార్టీ లేడీ లీడర్ అండ్ గ్యాంగ్ వ్యవహారం బట్టబయలు అయ్యింది.
మీకు ఏం కావాలి ? ఎంత కావాలి ? కేసుల్లేవ్ వెళ్లండి అంటూ ఆమె పోలీసుల మీద పెత్తనం చెలాయించింది. అధికారంలో ఉన్న నాయకులు సదరు మహిళ వ్యవహారంతో తలలు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు చాలా వెలుగు చూశాయి.

బెంగళూరు యువతులు, ఆంటీలు
బెంగళూరుకు చెందిన యువతులు, ఆంటీలను తమిళనాడు తీసుకు వచ్చి ఆంబూరు సమీపంలోని ఉమరాబాద్ లో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు చాలాసార్లు హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహకుల కోసం గాలించినా ఫలితం లేదు. పోలీసులు మాత్రం ఎక్కడ తేడా వచ్చింది ? అంటూ ఆరా తీస్తూనే ఉన్నారు.

అధికార పార్టీ ఆంటీ కింగ్ పిన్
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంది. అంబూరులోని కైలాసగిరికి చెందిన శంకర్ భార్య ప్రేమ (50) పార్టీ వ్యవహారాల్లో చురుకుగా ఉంటోంది. ప్రేమ కో- ఆపరేటివ్ సంఘాల మాజీ అధ్యక్షురాలు. ప్రస్తుతం ప్రేమ అన్నాడీఎంకే పార్టీ జిల్లా మహిళా నాయకురాలిగా పని చేస్తోంది. జిల్లాతో పాటు తమిళనాడులో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రేమ హాజరౌతుంది.

బెంగళూరు యువతి ఫిర్యాదు
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ యువతి ఆంబూరు పోలీస్ స్టేషన్ చేరుకుని తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది. ఎవరు మోసం చేశారు ? అంటూ ఆరా తీసిన పోలీసులు హడలిపోయారు. బెంగళూరుకు చెందిన తనను ఆంబూరు తీసుకు వచ్చి హైటెక్ వ్యభిచార కూపంలోకి దింపారని, తనకు రూ. 40 వేలు రావాలని, డబ్బులు ఇవ్వాలని అడిగితే కాలం గడుపుతున్నారని బెంగళూరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతులు పరుగో పరుగు
బెంగళూరు యువతి ఇచ్చిన సమాచారం మేరకు ఆంబూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓ ఇంటి తలుపులు తీశారు. ఇంటిలో ఉన్న యువతులు పోలీసులను చూసిన వెంటనే వెనుక దారి నుంచి పరుగు తీశారు. ఆ సమయంలో పోలీసులు వెంటాడి ఓ యువతిని పట్టుకున్నారు. పట్టుబడిన యువతి వానియంబాడికి చెందినదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మరో ముగ్గురు యువతులు మాత్రం అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.

అధికార పార్టీ ఆంటీ చెప్పిందని!
పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకురాలు ప్రేమ ఇక్కడ హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులకు పట్టుబడిన వానియంబాడి యువతి పోలీసులకు చెప్పింది. పోలీసులు అధికార పార్టీ నాయకురాలు ప్రేమ వ్యవహారం పూర్తిగా బయటకు తీశారు.

మీకు ఏం కావాలి .. ఎంత కావాలి.. కేసుల్లేవ్
యువతి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ ఇంటి దగ్గరకు వెళ్లారు. మేము అధికారంలో ఉన్నాం, కేసు లేదు, ఏమీ లేదు, మీకు ఏం కావాలి ? ఎంత కావాలి ? చెప్పండి అంటూ ప్రేమ పోలీసుల మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నించింది. నేను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను అంటూ ప్రేమ పోలీసుల మీద చిందులు వేసింది.

చేసింది చాలు ఇక పదండి ఆంటీ!
బెంగళూరు యువతి, వానియంబాడి యువతులు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన ఆంబూరు మహిళా పోలీసులు అధికార పార్టీ ఆంటీ ప్రేమ, మరో యువతిని అరెస్టు చేసి వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. యువతుల ఫిర్యాదు మేరకు అధికార పార్టీ నాయకురాలు ప్రేమ ఇంకా ఇలాంటి హైటెక్ వ్యభిచార కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నది ? అంటూ విచారణ చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications