జయలలిత ట్విస్ట్‌లు: అమ్మ సీఎం పదవి కోసం ఎమ్మెల్యే రాజీనామా
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వ్యూహాలు ఎవరికీ అర్థం కావటం లేదని చెప్పవచ్చు. ఆస్తుల కేసులో హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన అనంతరం జయలలిత సీఎంగా బాధ్యతలు చేపడతారని భావించారు.
అంతలోనే సుప్రీంలో క్లీన్ చిట్ వచ్చాకే ఆమె చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, మరో ట్విస్ట్. ఇప్పుటు ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన శాసన సభ్యుడు పీ వెట్రివేల్ ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేశాడు. సభాపతి పీ ధనపాల్ వెంనటే ఈ రాజీనామాను ఆమోదించారు. కోర్టు నిర్దోషిగా తేల్చిన జయలలితను ఈ నెల 22వ తేదీన శాసన సభా పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోపక్క చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వెట్రివేల్ రాజీనామా చేయడం గమనార్హం. జయ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వెట్రివేల్ రాజీనామా చేసి ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications