శశికళ మైండ్ గేమ్, పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టేందుకే, వేటు పడింది

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తననే ధిక్కరించి అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్న పార్టీ సీనియర్లపై వేటు వెయ్యాలని శశికళ నటరాజన్ భావిస్తున్నారు. మనల్ని ధిక్కరించిన వారిపై వెంటనే వేటు వెయ్యాలని ఆమె వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు.

అయితే రెండు మూడు రోజులు వేచి చూసి ఇంకా ఎవరెవరు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తారో అని స్పష్టత వచ్చిన తరువాత అందరి మీద ఒకే సారి చర్యలు తీసుకుని వేటు వెయ్యాలని శశికళ భావిస్తున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు.

పుదుచ్చేరి వెల్లికుప్పం మాజీ ఎమ్మెల్యే ఓంశక్తి శేఖర్ ను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని శశికళ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నేటి నుంచి ఓంశక్తి శేఖర్ తో సంబంధాలు పెట్టుకోరాదని శశికళ ఆదేశాలు జారీ చేశారు.

AIADMK MLA extends hi support to Tamil Nadu CM Panneerselvam

మరో వైపు అన్నాడీఎంకే ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్, పార్టీ సీనియర్ నేత విశ్వనాథనన్ తదితరులు కూడా పన్నీర్ సెల్వంకు బహిరంగంగా మద్దతు పలకడంతో పాటు శశికళ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినా వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అలెగ్జాండర్, మనోరంజితం, మాణిక్యం, ఆర్. కుట్టి, షణ్మగనాథన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ తదితరు మీద ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వారందరినీ పార్టీలోకి తీసుకుని పన్నీర్ సెల్వంను ఏకాకి చెయ్యాలని శశికళ వర్గీయులు విఫలయత్నం చేస్తున్నారు. అయితే శశికళ వర్గంలో ఉన్న వారే బయటకు వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, శశికళ అంత ధైర్యంగా వారి మీద వేటు వెయ్యలేరని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+