రాష్ట్రపతిని కలిసిన అన్నాడీఎంకే ఎంపీలు, పన్నీర్ అత్యవసర సమావేశం
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు మనవి చేశారు. జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఆర్డినెన్సు ఏ విదంగా వస్తుంది ?
చెన్నై/న్యూఢిల్లీ: జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు మనవి చేశారు. శనివారం న్యూఢిల్లీని రాష్ట్రపతి భవన్ చేరుకున్న అన్నాడీఎంకే ఎంపీలు జల్లికట్టు సాహస క్రీడ చరిత్ర గురించి ప్రణబ్ ముఖర్జీకి వివరించారు.
షాక్: ఈ వీడియో చూశాక కూడా జల్లికట్టు వద్దంటారా ! (వీడియో)
ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న జల్లికట్టు సాంప్రదాయ క్రీడను నిర్వహించడానికి అనుమతి వచ్చేలా మీరు చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు మనవి చేశారు. న్యాయశాఖ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రపతి అన్నాడీఎంకే ఎంపీలకు హామి ఇచ్చారని సమాచారం.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఆర్డినెన్సు ఏ విదంగా వస్తుంది ? అని అధికారులతో చర్చిస్తున్నారు.
జల్లికట్టు పోరాటం: రూ. కోటి ఇస్తా, డైరెక్టర్ లారెన్స్: విదేశీ కుట్ర
జల్లికట్టు నిర్వహణకు అర్డినెన్సు జారీ చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఆందోళన విరమించాలని పన్నీర్ సెల్వం ఎన్ని సార్లు మనవి చేసినా విద్యార్థులు మాత్రం ఆందోళన విరమించకుండా మొండిపట్టుపడుతున్నారు.












Click it and Unblock the Notifications