ఢిల్లీకి చేరిన జల్లికట్టు పంచాయితీ:రాష్ట్రపతిని కలవనున్న ఎంపిలు

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు అన్నాడిఎంకె ఎంపిలు, ఇదే విషయమై తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలను దృస్టిలో ఉంచుకొని వారు ప్రణబ్ ను కలుస్తారు.

ఢిల్లీ :జల్లికట్టు పై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ అన్నాడిఎంకె ఎంపిలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఢిల్లీ కేంద్రంగా అన్నాడిఎంకె ఈ వివాదంపై ఆర్డినెన్స్ ను తేవాలని డిమాండ్ చేస్తోంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని మేరీనాబీచ్ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ ఆందోళనలతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతపై నిరసనల హోరు కొనసాగుతోంది. రాజకీయపార్టీలు, సినీ ప్రముఖులు ఈ నిరసనలకు మద్దతును ప్రకటించారు.విధ్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు.

తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం కొనసాగుతున్నందున ఆందోళనలను ఉధృతం చేస్తే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని ఆందోళన కారులు భావిస్తున్నారు.

రాష్ట్రపతిని కలవనున్న అన్నాడిఎంకె ఎంపిలు

రాష్ట్రపతిని కలవనున్న అన్నాడిఎంకె ఎంపిలు

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ అన్నాడిఎంకె ఎంపిలు రాష్ట్రపతిని కలవనున్నారు జల్లికట్టుపై తమిళనాడులో ఆందోళనలు తీవ్రమమయ్యాయి.ఈ పరిస్థితుల దృస్ట్యా ఆర్ఢినెన్స్ ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు అన్నాడిఎంకె ఎంపిలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించనున్నారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకురావాలని అన్నాడిఎంకె ఎంపిలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

 కేంద్రంపై అన్నాడిఎంకె ఒత్తిడి

కేంద్రంపై అన్నాడిఎంకె ఒత్తిడి

జల్లికట్టుపై ఉన్న నిషేధం ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంపై అన్నాడిఎంకె ఒత్తిడితెస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎంపిలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వారు కేంద్రమంత్రికి వివరించారు.ఈ అంశంపై రాజ్ నాథ్ సింగ్ కూడ సానుకూలంగా స్పందించారని సమాచారం. మరో వైపు ఈ అంశం సెంటిమెంట్ తో కూడుకొన్నందున సెంటిమెంట్ ను కూడ గౌరవించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడ అభిప్రాయపడుతోంది.

రాజకీయపార్టీలకు అతీతంగా ఆందోళన చేపట్టిన యువత

రాజకీయపార్టీలకు అతీతంగా ఆందోళన చేపట్టిన యువత

సంక్రాంతి పూర్తైన తర్వాత జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టింది. మెరీనాబీచ్ లో ఆందోళనలను యువత ప్రారంభించారు. కాలేజీలను మానుకొని యూత్ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.యువతకు తోడుగా టెక్కీలు కూడ పాలుపంచుకొన్నారు. గంట గంటకు రోజు రోజుకు ఈ ఆందోళనకు మద్దతు పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీలు కూడ ఈ ఆందోళనలకు మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. మరో వైపు సిని పరిశ్రమ కూడ ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచారు.

అధికార, విపక్ష పార్టీలకు ప్రచారఅస్త్రంగా మారిన జల్లికట్టు

అధికార, విపక్ష పార్టీలకు ప్రచారఅస్త్రంగా మారిన జల్లికట్టు

తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్ అధికార అన్నాడిఎంకె , విపక్ష డిఎంకె లకు ప్రచారాస్త్రాలను సమకూర్చాయి. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీపై వివక్ష డిఎంకె విమర్శలను గుప్పిస్తోంది. జల్లికట్టుపై సంక్రాంతి ముందు రోజే డిఎంకె ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలను నిర్వహించారు. అయితే ఈ వ్యవహరం రాజకీయంగా తమకు ఇబ్బంది కల్గిస్తోందనే ఉద్దేశ్యంతో అన్నాడిఎంకె కూడ కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని తమిళనాడు పట్టు

ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని తమిళనాడు పట్టు

ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు.అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ కూడ ప్రధానమంత్రి కి లేఖ రాశారు. డిఎంకె కూడ కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయమై డిమాండ్ చేసింది. మరో వైపు డిఎంకె జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశమై తీర్మాణం కూడ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+