టి.టి.వి. దినకరన్ ను అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: అనుకున్నట్లుగానే టి.టి.వి. దినకరన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో ఆ పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. తొలుత సుఖేశ్ చంద్రశేఖర్ ఎవరో తెలియదని చెప్పిన దినకరన్ తర్వాత అతను తెలుసు అని అంగీకరించాడు.

ఈ కేసులో దినకరన్ సహాయకుడు మలిఖార్జునను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నాటకీయ పరిణామాల నడుమ టి.టి.వి. దినకరన్ ను కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications