జైల్లో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు: డీఐజీ రూపపై పరువునష్టం దావా: అన్నాడీఎంకే వార్నింగ్ !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేసిన ఐపీఎస్ మహిళా అధికారిణి, డీఐజీ రూప మీద పరువునష్టం దావా వేస్తామని అన్నాడీఎంకే పార్టీ .
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేసిన ఐపీఎస్ మహిళా అధికారిణి, డీఐజీ రూప మీద పరువునష్టం దావా వేస్తామని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) హెచ్చరించింది.
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక శాఖ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే డీఐజీ రూపను కోర్టుకు లాగుతామని ఆ పార్టీ నాయకులు సోమవారం ఈ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ సాదారణ ఖైదీలాగే శిక్ష అనుభవిస్తున్నారని వారు అంటున్నారు.

ఐపీఎస్ ల గొడవ, శశికళ బలిపశువు !
కర్ణాటక జైళ్ల శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, వారు ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడానికి శశికళ మీద నిందలు వేసి చిన్నమ్మను బలిపశువును చేశారని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక శాఖ నాయకులు ఆరోపించారు.

శశికళ, అన్నాడీఎంకే పార్టీ టార్గెట్ ?
తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ), శశికళను టార్గెట్ చేసుకుని డీఐజీ రూప ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఇప్పటికే చెయ్యని తప్పుకు శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారని వారు విచారం వ్యక్తం చేశారు.

నివేదిక వస్తే తరువాత చూస్తాం
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని వ్యవహారంపై విచారణ జరుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఇచ్చే నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని, నివేదిక వచ్చిన తరువాత రూప మీద పరువునష్టం దావా వేస్తామని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక శాఖ నాయకులు అంటున్నారు.

రూప కోర్టులో ఏం చెబుతారు ?
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మీద చేసిన ఆరోపణలకు డీఐజీ రూప కోర్టులోనే సమాధానం చెప్పాలని, ఆమెను కచ్చితంగా కోర్టుకు లాగుతామని అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గీయులు హెచ్చరిస్తున్నారు.

పోలీసులు, వీడియో లీక్ అయినా వార్నింగ్ !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని ఇప్పటికే కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినా అన్నాడీఎంకే పార్టీలోని చిన్నమ్మ వర్గీయులు సిన్సియర్ పోలీసు అధికారిణి రూప మీద ఇలాంటి ఆరోపణలు చెయ్యడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications