యువతకు ‘వరాలజల్లు’. నిరుద్యోగులకు ప్రతినెల రూ. 3 వేలు, రెండేళ్లు గ్యారెంటీ, నమ్మకం ఉంటే !
కర్ణాటకలోని యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఉచిత డబ్బుల పంపిణి వరాలజల్లు కురిపించింది. నిరుద్యోగులకు ప్రతినెల రూ. 3 వేలు ఇస్తామని, ఇంకా మహిళలలకు !
బెంగళూరు/బెళగావి/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మల్లికార్జున ఖార్గే మొదటిసారి కర్ణాటకలో బహిరంగ సభలో మాట్లాడారు. పక్కలో రాహుల్ గాంధీ ఉండటంతో మల్లికార్జున్ ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాతో పాటు బీజేపీ మీద విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు అయినా మల్లికార్జున ఖార్గే రిమోట్ వేరేవారి చేతిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారని, అయితే జేపీ నడ్డా రిమోట్ ఎవరి చేతిలో ఉందో అదే ప్రధాని మోదీ చెప్పాలని మల్లికార్జున ఖార్గే డిమాండ్ చేశారు. కర్ణాటకలోని యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఉచిత డబ్బుల పంపిణి వరాలజల్లు కురిపించింది.

బెళగావిలో కాంగ్రెస్ పార్టీ జోరు
కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ తో పాటు కేంద్ర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బెళగావిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్బంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే బీజేపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నా రాజకీయ జీవితంలో ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఇలాంటి బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మల్లికార్జున్ ఖార్గే విరుచుకుపడ్డారు.

40 శాతం కమీషన్
కర్ణాటకలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రూ. 100 పనిని రూ. 200కు ఎస్టిమేషన్ వేసి అందులో ప్రభుత్వలోని మంత్రులు, పెద్దలు 40 శాతం కమీషన్ తీసుకుని వారి జోబులు నింపుకుంటున్నారని మల్లికార్జున్ ఖార్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని అవినీతి ప్రభుత్వం గురించి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాకు తాను లేఖలు రాసినా వారు మాత్రం ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని మల్లికార్జున్ ఖార్గే ఆరోపించారు.

నా గురించి మాట్లాడే ముందు మీ గురించి చెప్పండి
ఏఐసీసీ అధ్యక్షుడు అయినా మల్లికార్జున ఖార్గే రిమోట్ వేరేవారి చేతిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారని, అయితే జేపీ నడ్డా రిమోట్ ఎవరి చేతిలో ఉందో అదే ప్రధాని మోదీ చెప్పాలని మల్లికార్జున ఖార్గే డిమాండ్ చేశారు. నా రిమోట్ గురించి మాట్లాడే ముందు మీ నాయకుల రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడితే బాగుంటుందని మల్లికార్జున ఖార్గే బీజేపీ నాయకులను ఎద్దేవ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తాను బెళగావిలో బహిరంగ సభకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, గతంలో ఇదే బెళగావి ప్రజలు మహాత్మా గాంధీని ఆదరించిన గడ్డ అని మల్లికార్జున ఖార్గే గుర్తు చేశారు.

యువతకు ఉచిత వరాలు
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అనుకుంటున్న కాంగ్రెస్ యువతకు, మహిళలకు వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగులకు నెలకు ఒక్కొక్కరికి రూ. 3,000, డిప్లొమో పూర్తి చేసిన నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ప్రతినెల రూ. 1,500 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండు సంత్సరాలు యువతకు ఈ నగదు ప్రోత్సాహం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో గ్యారెంటీ ఇచ్చింది.

2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తాము
ఇక గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి పథకాలు అమలు చేస్తామని కన్నడిగులకు రాహుల్ గాంధీ హామీతో పాటు గ్యారెంటీ కూడా ఇచ్చేశారు. కేంద్రంలో 50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వాటిని బర్తీ చెయ్యలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో 2.50 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కర్ణాటకలోని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. బెళగావిలోని 18 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 18 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మల్లికార్జున్ ఖార్గే ధీమా వ్యక్తం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications