కర్ణాటక ప్లాన్ అక్కడా రిపీట్, టార్గెట్ ఎంపీ, మహిళలు, రైతులు, గ్యాస్, ఫ్రీకరెంట్, దేవుడా !
బెంగళూరు/భోపాల్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు ఉచిత హామీలను ప్రకటించి ఆ రాష్ట్రంలో ఊహించని మెజారిటీ సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉచిత హామీలు వరాలు కురుపిస్తున్నది. కర్ణాటకలో లాగానే మధ్యప్రదేశ్ లో కూడా ఉచిత హామీల వలన లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వరుసగా ఉచిత హామీలను ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించారు.

మధ్యప్రదేశ్ లోని రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలను ఆకర్షించేందుకు అనేక ఉచిత హామీల పథకాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రకటించారు. రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కులాల వారీగా జనాభా గణన చేపడతామని మల్లికార్జున ఖార్గే హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత కోసం ప్రతి మహిళకు నెలకు రూ.1, 500 అందజేస్తామన్నారు.
ప్రతి కుటుంబానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను రూ. 500కే ఇస్తామన్నారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని మల్లికార్జున్ ఖార్గే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకే నేడు ప్రధానిగా నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారని మల్లికార్జున ఖార్గే అన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగర్ జిల్లాలో సంత్ రవిదాస్ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, దళితుల పోరాటాలను ఉద్ధరించిన ప్రముఖ భక్తి ఉద్యమ సన్యాసి సంత్ రవిదాస్‌ను, కవిత్వం, ఆధ్యాత్మికత ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంత్ రవిదాస్‌ను అధికారంలో ఉన్న బీజేపీ కనీసం స్మరించుకోవడం లేదని మల్లికార్జున ఖార్గే విమర్శించారు.












Click it and Unblock the Notifications