హంపిలో ప్రసిద్ది చెందిన విరుపాక్షేశ్వరుడి దర్శనానికి వెళ్లని రాహుల్ గాంధీ, మూడనమ్మకం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రపంచ ప్రసిద్ది చెందిన హంపిలోని విరుపాక్షేశ్వరుడి దేవాలయం దర్శించుకుండానే హోస్ పేట నుంచి వెనుతిరిగారు. దేశంలోని అనేక శివుడి దేవాలయాలు దర్శించుకుంటున్న రాహుల్ గాంధీ హంపిలోని విరూపాక్షేశ్వేర దేవాలయం, పార్వతి (భువనేశ్వరి) దేవి ఆలయాలు ఎందుకు దర్శించలేదని ఇప్పడు పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

నాలుగు రోజులు

నాలుగు రోజులు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం (ఫిబ్రవరి 10వ తేది) నుంచి నాలుగు రోజుల పాటు కర్ణాటకలో శాసన సభ ఎన్నికల మొదటి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేపీసీసీ కార్యాలయం రాహుల్ గాంధీ పర్యటన వివారాలు విడుదల చేసింది.

ఆలయాలు

ఆలయాలు

రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా పలు ఆలయాలు. దర్గాలు సందర్శిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. హెస్ పేట (విజయనగర)లో బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ హంపిలోని విరుపాక్షేశ్వర దేవాలయం సందర్శించకుండా కోప్పళ వెళ్లిపోయారు.

ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ

గతంలో కర్ణాటక ప్రభుత్వానికి సైతం సమాచారం ఇవ్వకుండా ఇందిరా గాంధీ రహస్యంగా హంపి చేరుకుని విరుపాక్షేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. జ్యోతిష్యుల సలహాతో రహస్యంగా వచ్చిన ఇందిరా గాంధీ దేవాలయంలో చాల సమయం గడిపారు. తరువాత ఇందిరా గాంధీ భారత ప్రధాని అయ్యారు.

రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ

బళ్లారిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన రాజీవ్ గాంధీ రాత్రి అదే నగరంలో బసచేశారు. మరుసటి రోజు హంపి చేరుకుని విరుపాక్షేశ్వరస్వామి దర్శనం చేసుకుని ఢిల్లీ వెళ్లారు. అయితే రాహుల్ గాంధీ పర్యటనలో విరుపాక్షేశ్వరస్వామి దర్శనం ఉన్నట్లు ఎక్కడ ప్రకటించలేదు.

మూడనమ్మకం?

మూడనమ్మకం?

ప్రపంచ వ్యాప్తంగా హంపికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశీలు హంపి వస్తే కచ్చితంగా విరుపాక్షేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. అలాంటిది హోస్ పేట వచ్చిన రాహుల్ గాంధీ విరుపాక్షేశ్వరుడి దర్శనం చేసుకోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న శివుడి ఆలయాలు సందర్శిస్తున్న రాహుల్ గాంధీ హంపిలోని విరుపాక్షేశ్వరుడిని ఎందుకు దర్శించుకోకుండా వెళ్లారు అని అర్థంకాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సతమతం అయ్యారు.

 అధికారం పోతుందని?

అధికారం పోతుందని?

విరుపాక్షేశ్వరుడి దర్శనం చేసుకుంటే అధికారం కొల్పోతామని సిద్దరామయ్య ప్రభుత్వం భయపడిందా ? మూడనమ్మకాలు పాటించారా ? అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది. రాహుల్ గాంధీ విరుపాక్షేశ్వర స్వామి దర్శనం చేసుకోకపోవడంతో హోస్ పేటలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ చెందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AICC president Rahul Gandhi will visit Ballari district on February 10, 2018. But he will not visit heritage city Hampi's famous Virupaksha Temple.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి