గే భర్త వేధింపులు: మహిళా వైద్యురాలి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కుడైన(గే) భర్త తనను మానిసకంగా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఎయిమ్స్‌కు చెందిన 31ఏళ్ల వైద్యురాలు చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త కూడా ఎయిమ్స్‌లోనే వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఎయిమ్స్‌లో వైద్యులుగా పని చేస్తున్న వీరిద్దరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త గే అనే విషయం వివాహానంతరం తెలిసినా సర్దుకుపోయాననీ, ఆ తర్వాత వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

భర్త అసహజ తీరు తెలిశాక కూడా ఆయన్నే కోరుకున్నానంటే దానికి కారణం తాను ఆయన్ని అమితంగా ప్రేమించడమేనని ఫేస్‌బుక్‌లో ఆమె చివరిసారిగా పేర్కొంది. భర్త కుటుంబం మంచిదేనని పేర్కొన్న ఆమె.. తన భర్త మాత్రం దెయ్యమని రాశారు.
భర్తతో గొడవ పడిన ఆమె ఓ హోటల్‌లో గది తీసుకుని, అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ యాజమాన్యం సమాచారం మేరకు గది తలుపులు పగలగొట్టిన పోలీసులు, రక్తపు మడుగులో పడివున్న వైద్యురాలిని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications