ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికెళ్లిన కోతి! ఏం చేసిందంటే..?

అనారోగ్యంగా ఉంటే ఆస్పత్రికి వెళ్లడం మనుషులకైతే సాధారణ విషయమే. అయితే, ఓ కోతి కూడా ఇలానే చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అంతేగాక, వైద్యుడి టేబుల్‌పైనే పడుకుంది.

డెహ్రాడూన్‌: అనారోగ్యంగా ఉంటే ఆస్పత్రికి వెళ్లడం మనుషులకైతే సాధారణ విషయమే. అయితే, ఓ కోతి కూడా ఇలానే చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అంతేగాక, వైద్యుడి టేబుల్‌పైనే పడుకుంది. ఈ ఘటన

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వానరం స్థానిక ఆస్పత్రికి వెళ్లి ఏకంగా డాక్టర్‌ టేబుల్‌పై కూర్చుంది. డాక్టర్‌ వచ్చే వరకు కాసేపు టేబుల్‌పై పడుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న సెలైన్‌ తీసుకుని తాగేసింది.

Ailing monkey visits doctor, takes glucose by himself

కొద్దిసేపటి తర్వాత అక్కడున్న ఓ వ్యక్తి దానికి అరటిపండు ఇచ్చినా అది తినలేదు. ఆ తర్వాత నర్సు దాని వద్దకు వస్తే పొట్ట చూపిస్తూ అరిచింది. ఆ తర్వాత నర్సు ఇచ్చిన సెలైన్‌ బాటిల్‌ తాగుతూ కూర్చుంది.

అలా మూడు బాటిళ్ల సెలైన్‌ తాగేసింది. ఆ తర్వాత దాని బాధ తగ్గిందో ఏమోగానీ, అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+