వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. 3 నెలల్లో 45 వేల టోపీలు, గిన్నిస్ రికార్డు, తయారు చేసింది ఎవరంటే

|
Google Oneindia TeluguNews

సాధించాలనే తపన ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. దానికి తర తమ, వయో భారం ఉండదు. అవును.. సామాన్యులు అయినా.. అధికారుల సతీమణి అయినా తప్పదు. నిజమే ఢిల్లీలో ఎయిర్ ఫోర్సు ఉద్యోగుల సంఘం రికార్డు సాధించింది. అదీ కూడా గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కింది. సంఘంలో 3 వేల మంది ఉండగా.. అధికారుల భార్యలే ఈ ఫీట్ చేశారు.

ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం రికార్డు సృష్టించింది. సంఘంలో సభ్యులుగా మూడు వేల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులు కేవలం 3 నెలల్లో వర్థమాన్‌ ఉన్నితో దాదాపు 41,541 టోపీలు తయారుచేశారు. అదీ తయారు చేసింది కూడా అధికారుల భార్యలే కావడం ఇక్కడ విశేషం. తక్కువ సమయంలో మన్నిక గల టోపీలను ధరించారు.

air force staff wives are make 45k caps

వారు పేరిట 'గిన్నిస్‌' రికార్డు నమోదు చేశారు. శనివారం ఢిల్లీలో గల ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితరులు సందర్శించారు. ఆ రికార్డ్ చేసిన మహిళలను వారు అభినందించారు. మిగతా వారు కూడా ప్రశంసిస్తున్నారు.

భర్తకు మంచి ఉద్యోగం, పిల్లలు చదువుల్లో బిజీ.. అని వారు ఊరికే ఉండలేదు. తక్కువ సమయంలోనే టోపీలను తయారు చేశారు. ఓ లక్ష్యంతో వారు వర్క్ చేశారు. అనుకున్న సమయంలో క్యాప్స్ తయారీ పూర్తయ్యింది. ఇంకేముంది.. వారు రికార్డుల్లోకి ఎక్కారు. పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.

English summary
air force staff wives are make 45k caps. they can created a guinness record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X