అర్ధరాత్రి వరకు పార్టీ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. తెల్లారేసరికి అర్ధనగ్నంగా...

తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు తన ఫ్లాట్ లోనే అర్ధరాత్రి వరకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఓ ఎయిర్ హోస్టెస్.. తెల్లారేసరికి.. అర్ధనగ్నంగా అపార్ట్‌మెంట్ బయట రోడ్డుపై విగతజీవురాలై పడి ఉంది.

కోల్‌కతా: తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు తన ఫ్లాట్ లోనే అర్ధరాత్రి వరకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఓ ఎయిర్ హోస్టెస్.. తెల్లారేసరికి.. అర్ధనగ్నంగా అపార్ట్‌మెంట్ బయట రోడ్డుపై విగతజీవురాలై పడి ఉంది.

ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ ఎయిర్ హోస్టెస్ మృతి అనుమానాస్పదంగా ఉంది. అది హత్యో, ఆత్మహత్యో తేలాల్సి ఉంది. ఆమె మృతికి ప్రేమ కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో లీడ్ కేబిన్ అటెండెంట్‌ గా పనిచేసే క్లారా ఖొంగ్ షీక్‌(23)కు కోల్‌కతాలోని కెస్టోపూర్ ఏరియాలో ఫ్లాట్ ఉంది. ఈ ప్రాంతం ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉంది.

Air hostess dies after falling from third floor flat in Kolkata

మీడియాకు అందిన సమాచారం ప్రకారం షిల్లాంగ్‌కు చెందిన క్లారా తండ్రి ఇటీవలే ఆమెకు కోల్‌కతాలో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. ఈ ఫ్లాట్‌లోనే క్లారా ఉంటోంది. ఈ దుర్ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె.. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది.

తెల్లవారు జామున పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసుకులకు క్లారా మృత దేహం అపార్ట్‌మెంట్ బయట రోడ్డుపై కనిపించింది. వివరాలు సేకరించిన పోలీసులు అపార్ట్ మెంట్‌లోని క్లారా ఫ్లాట్ కు వెళ్లి లోపల ఉన్న ఇద్దరు యువకులను అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

క్లారాను హత్యచేసి, ఆమె శవాన్ని వారు కిటికీలో నుంచి బయటకు తోసేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అయితే చంపడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందా?.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+