Air India బంపరాఫర్, ఛార్జీల్లో భారీ రాయితీ - వీరికి వర్తింపు..మార్గదర్శకాలు..!!

ప్రఖ్యాత విమానయాన సంస్థ ఏయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దేశీయ సర్వీసుల్లోనే ఈ రాయితీ ఉండగా.. ఇప్పటి నుంచి అంతర్జాతీయ సర్వీసుల్లోనూ అమలు చేయనుంది. ఈ మేరకు ఏ సర్వీసులో ఎంత మేర రాయితీ అమలు చేసేదీ స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది.

ఎయిరిండియా విమానయాన సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 60 ఏళ్లు పైబడిన(సీనియర్‌ సిటిజన్లు)వారికి టికెట్‌ ధరపై రాయితీ ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్‌ మూల ధరపై 10 శాతం వరకు, దేశీయ సర్వీసుల్లో అయితే 25ు వరకు రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఎకనామీ, బిజినెస్‌ క్లాస్‌ సహా అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రాయితీ పొందాలంటే ఎయిరిండియా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ అప్పుడే 'కన్‌సెషన్‌ టైప్‌' దగ్గర సీనియర్‌ సిటిజన్‌ కోటాను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలని సూచించింది.

air-india-announces-discount-for-senior-citizens-on-international-flights

అదే విధంగా ఈ రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు లగేజీని సీనియర్‌ సిటిజన్లు తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఎయిరిండియా ఇస్తుంది. అంతేకాక, సీనియర్‌ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఓసారి ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. అయితే, మార్పు చేసుకున్న ప్రయాణ తేదీలో టికెట్‌ ధర అధికంగా ఉంటే మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

టికెట్ బుక్ చేసుకునే సమయంలో గుర్తింపు కార్డును చూపించి వారి వయసును నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపింది. ఒక వేళ తనిఖీల సమయంలో సరైన గుర్తింపు కార్డులను సమర్పించకపోతే పూర్తి టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+