AAIB తాత్కాలిక నివేదికపై ఎయిర్ ఇండియా సీఈఓ షాకింగ్ కామెంట్స్..!
జూన్ 12న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా AI 171 బోయింగ్ 787 విమానం ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా రీసెంట్ గానే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తాత్కాలిక నివేదిక విడుదల చేసింది. అయితే ఆ నివేదికతో కొన్ని విషయాల్లో స్పష్టత లభించినప్పటికీ, మరిన్ని కీలక ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఎయిర్ ఇండియా సీఈఓ రియాక్ట్..
ఈ నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్.. "ఇది కొంత సమాచారం ఇచ్చినప్పటికీ మరిన్ని అనుమానాలకు దారితీసింది" అని పేర్కొన్నారు. ఆయన ఉద్యోగులకు పంపిన మెమోలో, "విమానంలో ఎటువంటి మెకానికల్ లోపాలు లేవు, ఇంజిన్‌లు సరిగా పనిచేశాయి, ఇంధన నాణ్యత బాగుంది. పైలట్లు వైద్య పరీక్షలు పాస్ అయ్యారు. టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితి లేదు" అని వివరించారు.

ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి?
మరోవైపు AAIB నివేదిక ప్రకారం, విమాన ఇంజిన్‌ను ఆపే ఫ్యూయల్ స్విచ్ లలో కదలిక ఉన్నట్టు గుర్తించారు. అయితే, అవి ఎందుకు కదలాయన్న విషయంపై నివేదిక స్పష్టత ఇవ్వలేదు. ఇది యాంత్రిక లోపమా? పైలట్ తప్పిదమా? లేక ఉద్దేశపూర్వక చర్యనా అన్నది ఇంకా తెలియరాలేదు.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో, ఒక పైలట్ "నీవెందుకు స్విచ్‌ను ఆపావు?" అని అడగగా, మరొకరు "నేను ఆపలేదు" అని సమాధానం ఇచ్చినట్లు ఉంది. అయితే ఆ మాటలు ఎవరు చెప్పారు అన్నది నివేదికలో చెప్పలేదు. ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) ఆధారంగా ఆ సమాధానం సరైందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
AAIB నివేదిక బోయింగ్ సంస్థపై ఎటువంటి తప్పిదం లేదని చెప్పడంతో, దృష్టి మొత్తం పైలట్ల వైపు మళ్లింది. విమాన తయారీదారు నిర్దోషి అని చెప్పటంతో, విమాన సిబ్బందిపై బాధ్యత వేయబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విమాన యాత్రికుల భద్రతే ప్రథమ కర్తవ్యం అని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రతి 787 విమానాన్ని ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా తనిఖీ చేశామని, అవన్నీ సేవలోకి తగినవేనని తెలిపింది.
ఇక బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్ లోడ్ చేసుకోవడానికి అమెరికా నుంచి 'గోల్డెన్ ఛాసిస్' అనే ప్రత్యేక పరికరాన్ని అధికారులు తీసుకువచ్చారు. ప్రమాదం నుంచి బ్లాక్ బాక్స్ ను వెంటనే గుర్తించినా.. దాని నుంచి డేటాను డౌన్ లోడ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి. ప్రమాద సమయంలో ఏర్పడిన తీవ్రవేడి వల్ల బ్లాక్ బాక్స్ దెబ్బతినడమే అందుకు కారణం అని తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications