ఇజ్రాయెల్‌పై భీకర దాడి: ఎయిరిండియా ఫ్లైట్లు రద్దు

Israel: గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షుడి భవనంపైనే మెరుపుదాడికి దిగింది. ఈ ఘటనతో డమాస్కస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

Air India flight to Tel Aviv was diverted to Abu Dhabi after Ben Gurion airport attacked by Houthis

ఇప్పుడు ఇజ్రాయెల్ సిరియాను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో ఈ దాడి సంభవించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. డ్రూజ్ కమ్యూనిటీ సభ్యులను రక్షించుకోవడంలో భాగంగా ఈ దాడిని చేపట్టినట్లు వివరించారు.

వారి ప్రాణరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. డ్రూజ్ సామాజికవర్గం.. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో విస్తరించివుంది. సిరియా, లెబనాన్‌లల్లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా పని చేస్తోందనే గుర్తింపు ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో బషర్ అల్-అసద్‌ను పడగొట్టిన సున్నీ ఇస్లామిస్టులు డ్రూజ్ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళం.. డమాస్కస్‌పై బాంబులతో హోరెత్తించింది. ఏకంగా సిరియా అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో డ్రూజ్ సామాజిక వర్గానికి చెందిన సెల్ఫ్ డిఫెన్స్ ఫైటర్లు.. సున్నీ ఇస్లామిస్టులపై ఎదురుదాడికి దిగారు.

ఈ పరిస్థితుల మధ్య యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై భారీ దాడికి దిగారు. భీకరంగా దాడి చేశారు. మిస్సైళ్లను సంధించారు. ప్రధానంగా బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీల దాడి భయానకంగా కొనసాగింది. ఈ ఎయిర్‌పోర్ట్‌పై ఏకంగా బాల్లిస్టిక్ క్షిపణులను సంధించారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ రాజధాని టెల్ అవివ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్. భారత్ సహా వివిధ దేశాలకు ఇక్కడి నుంచి ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. 21 మిలియన్ ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా నిర్మితమైంది. దీనిపై హౌతీలు ఏకంగా బాల్లిస్టిక్ క్షిపణులను సంధించారు.

ఈ దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధృవీకరించింది. క్షిపణి విమానాశ్రయం ప్రాంగణలోని యాక్సెస్ రోడ్డు గార్డెన్‌లో పడినట్లు వెల్లడించింది. టెర్మినల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ ఘటనలో ఆరుమంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేసినట్లు వివరించింది.

ఈ ఎయిర్ పోర్ట్ మొత్తం కూడా ఐడీఎఫ్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతం మొత్తంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్ట్‌కు వచ్చే మార్గాలన్నింటినీ కూడా మూసివేశారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.

ఈ దాడి ప్రభావం ఎయిరిండియాపై పడింది. ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ139 అబుదాబికి మళ్లించాల్సి వచ్చింది. ఈ విమానం అబుదాబిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, ఫ్లైట్ క్రూ భద్రతను దృష్టిలో ఉంచుకుని మే 6వ తేదీ వరకు టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.

మే 3- 6వ తేదీల మధ్య టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూలింగ్‌పై ఒకేసారి మినహాయింపు లేదా రద్దు అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొంది. టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని వివరించింది. ఈ మేరకు ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+