Air India: టెన్షన్ టెన్షన్.. పైలట్ నుంచి ఎమర్జెన్సీ హైజాక్ కోడ్!

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఆకాశంలో ప్రయాణిస్తుండగానే విమానం హైజాక్‌కు గురైందనే సిగ్నల్ ప్రత్యక్షం కావడంతో భద్రతా దళాలు, విమానాశ్రయ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పైలట్ నుంచి అత్యవసర 'హైజాక్ అలెర్ట్' కోడ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు, విమానాన్ని తక్షణమే దారిమళ్లించి రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనైనప్పటికీ, పైలట్లు సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

క్షణాల వ్యవధిలో కలకలం రేపిన సిగ్నల్!

బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి ఈ విమానం నుంచి కొన్ని సెకన్ల పాటు అత్యవసర సిగ్నల్ అందింది. విమానం హైజాక్ అయిందని లేదా అందులో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడానికి అంతర్జాతీయ ఏవియేషన్‌లో ఉపయోగించే 'స్క్వాక్ 7500' (Squawk 7500) అనే ప్రత్యేక ట్రాన్స్‌పాండర్ కోడ్‌ను పైలట్ యాక్టివేట్ చేశారు. ఈ సిగ్నల్ అందిన వెంటనే అటు ఏటీసీ, ఇటు భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉదయం 9:10 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయం వార్ రూమ్ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని ఢిల్లీకి రానివ్వకుండా జైపూర్‌కు దారిమళ్లించాలని నిర్ణయించారు.

Air India Frankfurt Delhi Flight Diverted To Jaipur After Pilot Activates Emergency Hijack Alert Code
 జేషే టాప్ 2 రవూఫ్ అజార్ హతం - విమానం హైజాక్, పార్లమెంట్ పై దాడి సూత్రధారి..!!
జేషే టాప్ 2 రవూఫ్ అజార్ హతం - విమానం హైజాక్, పార్లమెంట్ పై దాడి సూత్రధారి..!!

ఐసోలేషన్ బేకి విమానం.. తనిఖీల్లో పాల్గొన్న సెక్యూరిటీ బృందాలు!

దారిమళ్లించిన ఎయిర్ ఇండియా విమానం AI-2030 ఉదయం 9:35 గంటలకు జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. వెంటనే అధికారులు స్పందించి ఉదయం 9:45 గంటలకు విమానాన్ని ఇతర రద్దీకి దూరంగా ఉన్న ప్రత్యేక 'ఐసోలేషన్ బే'కు తరలించారు. అక్కడికి చేరుకున్న ప్రత్యేక భద్రతా బృందాలు, డాగ్ స్క్వాడ్స్ విమానాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. అయితే, సాంకేతిక పొరపాటు వల్ల ఈ కోడ్ యాక్టివేట్ అయిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర విచారణకు ఆదేశించింది.

కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!
కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!

ప్రయాణికులు క్షేమం.. ఆందోళన చెందవద్దని అదానీ ఎయిర్‌పోర్ట్ వెల్లడి!

జైపూర్ విమానాశ్రయాన్ని నిర్వహించే అదానీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. విమానంలోని ప్రయాణికులందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని, వారందరినీ విమానం నుంచి కిందకు దించి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తనిఖీలు పూర్తయిన తర్వాత వారిని గమ్యస్థానాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రయాణికులు గానీ, వారి బంధువులు గానీ ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+