ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌! టిక్కెట్లపై 50 శాతం తగ్గింపు.. ఎవరెవరికంటే...

విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ముఖ్యంగా విద్యార్థులకు డిస్కౌంట్ల రేట్లలో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఎకానమీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్న

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ముఖ్యంగా విద్యార్థులకు డిస్కౌంట్ రేట్లలో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఎకానమీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది.

12నుంచి 26 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ విద్యార్థులతోపాటు సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌కు కూడా వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఎయిర్‌ఇండియా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

 Air India Offers 50% Discount To Students And Other Select Categories

ఈ ఆఫర్‌లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు భారత్‌లో చదువుతున్న వారై ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర విద్యాసంస్థ/యూనివర్సిటీ తరుఫున గుర్తింపు పొందిన, దానికి అనుబంధ సంస్థలో అయిన కనీసం ఒక ఏడాది పాటు ఫుల్‌టైమ్‌ కోర్సులో ఎన్‌రోల్‌ చేసుకుని ఉండాలి. అలాగైతేనే ఎయిరిండియా ఈ ఆఫర్‌ అందిస్తోంది.

సెప్టెంబర్‌ 1 నుంచి ఆ ఆఫర్‌ వర్తిస్తుందనీ, ప్రయాణానికి వారం రోజుల ముందు టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ద్వారా టికెట్‌ బుకింగ్‌ ముగింపు తేదీని మాత్రం స్పష్టం చేయలేదు.

అలాగే ఈ ఆఫర్‌ లో 25కేజీల చెక్‌ ఇన్‌బ్యాగేజీ కూడా ఉచితమని తెలిపింది. ఎయిర్‌ ఇండియా అధికార వెబ్‌సైట్‌, కార్యాలయాల్లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎయిర్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+