Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమె కో-పైలట్‌గా వస్తేనే: ఫ్లైట్‌ను 2గం.ఆపేసిన పైలట్

న్యూఢిల్లీ: మహిళా కో పైలట్ కావాలని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలట్ పట్టుబట్టడంతో విమానం రెండు గంటలపాటు ఆలస్యమైంది. 110 మంది ప్రయాణీకులతో ఉన్న విమానాన్ని.. మహిళా కో పైలట్ కోసం పైలట్ రెండు గంటలపాటు ఆపివేయడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. తనకు నచ్చిన మహిళా పైలట్‌ను కో-పైలట్‌గా ఇవ్వలేదన్న కారణంతో మాలే నుంచి తిరువనంతపురం మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రెండు గంటలు ఆలస్యం చేశాడు సదరు పైలట్. మొత్తం 110 మంది పాసింజర్లు విమానం ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.

Air India pilot insists for particular woman co pilot, delays flight by 2 hours

సదరు మహిళా పైలట్‌ను కేటాయించేందుకు అధికారులకు సమయం ఇస్తూ.. తనకు బీపీ పెరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స పేరిట కాసేపు నాటకమాడాడు. తనకు ఆ మహిళా పైలట్‌నే ఇవ్వాలని రోస్టర్ సెక్షన్‌కు ముందే సమాచారం ఇచ్చాడట అతను.

అది కుదరదని, మహిళా పైలట్‌ను మరో విమానానికి కేటాయించామని చెబితే.. ససేమిరా అంటూ విమానాన్ని కదిలించేందుకు భీష్మించాడని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. దీనిపై అధికారులు స్పందించవలసి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+