45 లక్షల మంది డేటా చోరీ.. క్రెడిట్ కార్డు, పాస్ పోర్టు వివరాలు హ్యాక్: ఎయిర్ ఇండియా
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో భారీ స్థాయిలో డేటా చోరి జరిగింది. ఎయిరిండియా ప్రయాణికులకు సంబంధించిన డేటాను హ్యాక్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా వెల్లడించింది. కానీ ప్రయాణికులు వివరాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించామని చెబుతోంది. ఎయిర్ ఇండియాలో డేటా హ్యాక్ కలకలం రేపుతోంది.

ప్రయాణికులు క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు డేటా లీకయిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందని ఎయిరిండియా యాజమాన్యం వెల్లడించింది. వీరిలో స్వదేశీయులే కాగా విదేశీ ప్రయాణికులు ఉన్నారు. 2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఈ డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించారు. హ్యాకింగ్ జరిగిన విషయం గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిరిండియా స్పష్టం చేసింది.
Recommended Video
తమ సర్వర్లు హ్యాక్ చేసి డేటా తీసుకున్నారని పేర్కొన్నది. క్రెడిట్ కార్డు ద్వారా డేటా లీకయిందని.. అయితే వ్యక్తిగత వివరాలు మాత్రమే తెలుసుకున్నారని వివరించింది. కార్డు వెనకల గల సీవీవీ, సీవీసీ నంబర్లు వారికి తెలియవు అని చెప్పింది. ఎవరీ డేటా లీకయ్యిందని దానికి సంబంధించి మెయిల్ చేశామని వివరించింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని కంపెనీ తెలియజేసింది.












Click it and Unblock the Notifications