భారత్ అనుకున్నదొకటి.. తర్వాత చేసిందొకటి..! ఎయిర్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు..!

కాశ్మీర్ లో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై దీన్ని నడిపిస్తున్న వారిలో కీలకమైన ఎయిర్ మార్షల్ ఏకే భార్తి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆపరేషన్ మొదలుపెట్టిన లక్ష్యం వేరని, కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తీరుతో దాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని, కాబట్టి ఆ తర్వాత జరిగిన నష్టానికి ఆ దేశానిదే బాధ్యతని ఆయన క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, అయితే ఆ తర్వాత వారికి జరిగిన నష్టానికి మాత్రం ఆ దేశానిదే బాధ్యతని ఎయిర్ మార్షల్ ఏకే భార్తి తెలిపారు. వాస్తవానికి తమ పోరాటం ఉగ్రవాదులతో, వారి మౌలిక సదుపాయాలతో జరిగిందని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యంతో కాదన్నారు. అందుకే మే 7న తాము ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసినట్లు పేర్కొన్నారు.

air marshal ak Bharti reveals actual reason behind extension of operation sindoor against pakistan

అయితే పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల వైపు మొగ్గు చూపడం విచారమని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల పోరాటాన్ని తమ పోరాటంగా మార్చుకుందన్నారు. అందుకే తాము ప్రతీకారం తీర్చుకోవడం అవసరమైందన్నారు. పాకిస్తాన్ చవిచూసిన నష్టాలకు వారిదే బాథ్యతన్నారు. మరోవైపు భారత దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దేశాన్ని రక్షించే గోడలా నిలిచిందని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య సైనికాధికారుల చర్చల నేపథ్యంలో మరోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత సాయుధ దళాలు దేశంలోని పౌర, సైనిక మౌలిక సదుపాయాలకు జరిగే నష్టాన్ని తగ్గించగలిగాయని ఎయిర్ మార్షల్ భారతి గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+