ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్: మారన్ బ్రదర్స్‌కు సమన్లు
న్యూఢిల్లీ: మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్‌కు, ఆయన సోదరుడికి, మరో ఇద్దరికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్ కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. సన్ డైరెక్ట్ టీవితో పాటు నాలుగు కంపెనీలకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
దయానిధి మారన్‌తో పాటు ఆయన సోదరుడు కళానిధి మారన్, మలేసియా వ్యాపారవేత్త టి. అనంద కృష్ణన్‌లకు ప్రత్యేక 2జి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

మలేసియాకు చెందిన మాక్సిస్ గ్రూప్ ఉన్నతాధికారి ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీల్ కేసులో సిబిఐ ఆగస్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దయానిధి మారన్ డిఎంకె అగ్ర నేతల్లో ఒకరు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం డిఎంకె పనిచేసింది. దయానిధి మారన్ 2004 నుంచి 2007 వరకు టెలికం మంత్రిగా పనిచేశారు.
దయానిధి మారన్ తన అధికారాన్ని ఉపయోగించి ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ కంపెనీకి విక్రయించడానికి ఎయిర్‌సెల్ యజమాని సి. శివశంకరన్‌పై 2006లో ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగా మాక్సిస్ దయానిధి మారన్ సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన మీడియా సంస్థలో 650 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణ. అయితే, తాము ఏ విధమైన తప్పు చేయలేదని మారన్ సోదరులు, మాక్సిస్ ఉన్నతాధికారులు అంటూ వస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications